
ప్రయాగ్‌రాజ్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు
Indian Kisan Union (బికెయు) ఏ Political partyకి తన మద్దతు ఇస్తుందనే వార్తలను నాయకుడు Rakesh Tikait ఖండించారు. పరేడ్ గ్రౌండ్‌లో రైతుల మూడు రోజుల 'Chintan Shivir'లో పాల్గొనడానికి మాగ్ మేళాకు వచ్చిన టికైత్ మంగళవారం మాట్లాడుతూ, "ఈ ఎన్నికల్లో మేము ఎవరికీ మద్దతు ఇవ్వం" అని తేల్చి చెప్పారు. దీంతో బికెయు మద్దతు ఏ పార్టీకి అని గత కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్టైంది.
Uttar Pradeshలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ
Lok Dal-Samajwadi Party కూటమికి మద్దతు ఇవ్వాలని BKU అధ్యక్షుడు నరేష్ టికైత్ విజ్ఞప్తి చేసిన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. అది కూడా.. BJPకి చెందిన సంజీవ్ బల్యాన్‌తో సిసౌలిలో సమావేశమైన కొన్ని గంటల తర్వాత, బికెయు చీఫ్ తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. తాను ఎవరికీ మద్దతు ఇవ్వడం లేదని తాజాగా ప్రకటించారు.
రైతుల 'చింతన్ శివిర్'లో రాకేష్ టికైత్ మాట్లాడుతూ, రైతుల సమస్యలపై చర్చించారు."రైతులు, సంస్థకు సంబంధించిన విషయాలు మూడు రోజుల మేధోమథన సెషన్‌లో చర్చించబడ్డాయి" అని రాకేష్ టికైత్ తెలిపారు. ఉద్యమవిరమణ సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వదిలేశారని ప్రభుత్వంపై BKU నాయకుడు నిరాశను వ్యక్తం చేశారు.
"దేశవ్యాప్త రైతుల ఆందోళన సమయంలో, ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అది జరగలేదు. లఖింపూర్ ఖేరీ సంఘటనలో, మా వాళ్లను చాలా మందిని జైలుకు పంపారు. ఇక రైతులమీద జీప్ తోలిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొన్న హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఇప్పటికీ తన పదవిలోనే ఉన్నారు. ఇది చాలా పెద్ద సమస్య. ధాన్యాల సేకరణలోనూ సమస్యలు ఉన్నాయి. ఈ అంశాలపై చర్చించాం" అని రాకేష్ టికైత్ చెప్పారు.
రాజకీయ పార్టీలు ఇప్పుడు మా మద్దతు గురించి ఆలోచిస్తున్నాయంటే.. అది మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా (ఇప్పుడు రద్దు చేయబడిన) రైతుల చేసిన 13 నెలల ఆందోళన సాధించిన "అతిపెద్ద విజయం" అని ఆయన అన్నారు.
ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల వేళ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ కి ఊహించని షాక్ తగిలింది. ఆయన సొంత కోడలు బీజేపీలో చేరడం గమనార్హం. ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్.. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ సమక్షంలో బీజేపీలో చేరారు. కాగా గత కొంతకాలంగా.. ఈ మేరకు వార్తలు హల్ చల్ చేస్తుండగా.. నేడు అధికారంగా ఆమె బీజేపీ కండువా కప్పుకున్నారు.
ములాయం సింగ్ రెండో భార్య సాధన యాదవ్ కొడుకు ప్రతీక్ భార్య.. అపర్ణయాదవ్. అపర్ణ తండ్రి అరవింద్ సింగ్ బిష్త్ జర్నలిస్ట్.. సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వ హయాంలో అపర్ణ తండ్రిని సమాచార కమిషనర్ గా నియమించారు. అపర్ణ లక్నోలోని లోరెటో కాన్వెంట్ ఇంటర్మీడియట్ కాలేజీలో పాఠశాల విద్యను అభ్యసించింది. అపర్ణ, ప్రతీక్ చదువుకునే రోజుల్లో కలుసుకుని, ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు.