హర్యానా సీఎం ఖట్టర్ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ యత్నం: వాటర్ క్యానాన్లను ప్రయోగించిన పోలీసులు

By narsimha lodeFirst Published Dec 2, 2020, 2:37 PM IST
Highlights

హర్యానా రాష్ట్ర సీఎం ఖట్టర్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు వాటర్ క్యానాన్ లను ప్రయోగించారు.

న్యూఢిల్లీ: హర్యానా రాష్ట్ర సీఎం ఖట్టర్ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు వాటర్ క్యానాన్ లను ప్రయోగించారు.

ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులపై  హర్యానా సీఎం కట్టర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. సీఎం క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

ఈ డిమాండ్ తో హర్యానా సీఎం ఖట్టర్ నివాసాన్ని బుధవారం నాడు ఇవాళ ముట్టడించేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు  ప్రయత్నించారు. 

యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు  సీఎం ఇంటిని ముట్టడించకుండా  ఉండేందుకు బారికేడ్లను ఉంచారు. బారికేడ్లను తోసుకొని సీఎం ఇంటి వైపు వస్తున్న ఆందోళనకారులపై పోలీసులు వాటర్ క్యానాన్లను ప్రయోగించారు.

also read:ఢిల్లీలో రైతుల ఆందోళనలు: ట్రాఫిక్ మళ్లింపు

వాటర్ క్యానాన్లను ప్రయోగించడం ద్వారా  ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఏడు రోజులుగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిన్న కేంద్ర ప్రభుత్వం రైతులతో నిర్వహించిన చర్చలు విపలమయ్యాయి. దీంతో రైతులు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. రేపు మరోసారి రైతులతో కేంద్ర ప్రభుత్వం చర్చించే అవకాశం ఉందని సమాచారం.

 


 

click me!