రజీనికాంత్‌కు దిమ్మతిరిగే షాక్.. అలా అయితే మద్దతివ్వం : అభిమాన సంఘాలు..

Bukka Sumabala   | Asianet News
Published : Nov 30, 2020, 12:44 PM IST
రజీనికాంత్‌కు దిమ్మతిరిగే షాక్.. అలా అయితే మద్దతివ్వం : అభిమాన సంఘాలు..

సారాంశం

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ రాజకీయ రంగ ప్రవేశంపై అభిమాన సంఘాలు ఆయనకు దిమ్మ దిరిగే షాక్ ఇచ్చాయి. రజినీకాంత్ రాజకీయరంగ ప్రవేశంపై ఇవాళ కీలక ప్రకటన చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు అభిమానులతో సమావేశం ఏర్పాటు చేశారు.

చాలా కాలంగా రజినీకాంత్ రాజకీయాలలోకి ఎంట్రీపై అనేక కథనాలు వెలువడ్డాయి. 2019 లోనే రాజకీయాల్లోకి వస్తారని అనుకున్నారు.  కానీ, రాజకీయాల్లోకి రావటానికి ఇంకా సమయం ఉందని, త్వరలోనే అన్ని విషయాలు చెప్తానని గతంలో పేర్కొన్నారు.  

అయితే..  ఈరోజు ఉదయం అభిమాన సంఘాలతో సమావేశం అయ్యారు రజినీకాంత్‌.  ఈ సమావేశంలో రజినీకాంత్‌ ఊహించని అనుభవం ఎదురైంది. ఈ సమావేశంలో బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా అభిమాన సంఘాలు నినాదాలు చేశాయి. 

మీరు పార్టీ పెడితేనే మీ వెంట నడుస్తామని తేల్చి చెప్పేశారు అభిమాన సంఘాల నేతలు. బీజేపీకి గనక రజనీకాంత్ మద్దతు ఇస్తే అభిమాన సంఘాలు ఆయన వెంట నడువలేవంటూ స్పష్టం చేశాయి.

అనుకోని అభిమాన సంఘాల ఈ స్పందనకు సూపర్ స్టార్ట రజినీకాంత్‌  షాక్‌ తిన్నారు. వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు. ఈ పరిణామంతో తమిళనాడు రాజకీయాలు మరింత కాక రేపుతున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!