మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి శశికళ?: సోషల్ మీడియాలో ఆడియో వైరల్

By narsimha lodeFirst Published May 30, 2021, 4:02 PM IST
Highlights

అన్నాడిఎంకె నుండి బహిష్కరణకు గురైన శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సన్నహాలు చేసుకొంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది. 

చెన్నై: అన్నాడిఎంకె నుండి బహిష్కరణకు గురైన శశికళ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సన్నహాలు చేసుకొంటున్నట్టుగా ప్రచారం సాగుతోంది. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి గత మాసంలోనే ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో అన్నాడిఎంకె ఓటమిని చవిచూసింది. ఈ ఎన్నికల సమయంలోనే ఆమె క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టుగా ప్రకటించారు. రాష్ట్రంలో అన్నాడిఎంకె ఓటమి పాలు కావడంతో ఆమె తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలనే ప్రయత్నాలను ప్రారంభించాలని భావిస్తున్నట్టుగా సన్నిహితుల వద్ద చెప్పినట్టుగా సమాచారం.

also read:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్: శశికళకు షాక్, ఓటు గల్లంతు

ఎలాంటి ఆందోళన చెందొద్దని శశికళ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అన్నాడిఎంకె కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు శశికళ. కరోనా ముగిసిన తర్వాత నేను వస్తానని ఆమె ఆ ఆడియో సంభాషణలో చెప్పారు.ఈ విషయాన్ని టీటీవీ దినకరన్ వ్యక్తిగత సహాయకుడు జనార్ధన్ కూడ ధృవీకరించారు. తాము మీ వెంట ఉంటామని అన్నాడిఎంకె క్యాడర్  కూడ అదే స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణించిన తర్వాత అన్నాడిఎంకె జనరల్ సెక్రటరీగా శశికళ నియమితులయ్యారు. అయితే 2017లో అక్రమాస్తుల కేసులో దోషిగా తేలడంతో ఆమె జైలుకు వెళ్లారు. దీంతో 2017 సెప్టెంబర్ లో ఆమెను అన్నాడిఎంకె  నుండి తొలగించారు. 


 

click me!