అత్యద్భుతంగా అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు.. కొత్త శకం దిశగా.. (వీడియో)

Published : May 21, 2023, 12:06 PM ISTUpdated : May 21, 2023, 12:10 PM IST
అత్యద్భుతంగా అయోధ్య  రామమందిరం నిర్మాణ పనులు.. కొత్త శకం దిశగా.. (వీడియో)

సారాంశం

అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భారతీయులు కొత్త శకం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

అయోధ్యలో రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆ ప్రదేశాన్ని  మిలియన్ల మంది ప్రజలు శ్రీరాముని జన్మస్థలంగా నమ్ముతారు. అయితే అక్కడ వివాదస్పద స్థలానికి సంబంధించిన రాజకీయ, సామాజిక, మత, న్యాయపరమైన వివాదాలు వందేళ్లకు పైగా భారతదేశాన్ని కుదిపేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అయోధ్య కొంత కీర్తిని  కోల్పోయింది. అయితే 2019 నవంబర్ 9వ తేదీన సుప్రీం కోర్టు రామ మందిరం నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో.. అయోధ్య చరిత్రలో సరికొత్త అధ్యాయనం మొదలైంది. 

వివాదస్థలం రామ్ లల్లాకు చెందుతుందని సుప్రీం కోర్టు ల్యాండ్ మార్క్ తీర్పు వెలువరించింది. అక్కడ రామమందిరం నిర్మాణం చేపట్టవచ్చని తెలిపింది. అలాగే.. మసీదు నిర్మాణం కోసం సున్నీ వక్ఫ్‌బోర్డ్‌కు అయోధ్యలోనే వివాదస్పద స్థలానికి బయటకు ఒక ప్రధాన ప్రాంతంలో ఐదెకరాల స్థలం కేటాయించాలని పేర్కొంది. దీంతో చాలా దశాబ్దలుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడి.. రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం అక్కడ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది భారతీయులు కొత్త శకం కోసం ఎదురు చూస్తున్నారు. 

అయితే రామమందిర నిర్మాణం ఒక అద్భుతంగా మారనుంది. రామమందిరం నిర్మాణం ఎప్పుడూ పూర్తవుతుందా?.. కొత్త ఆలయంలో తమ ప్రియమైన దేవుడిని దర్శించుకునేందుకు ఎప్పటి నుంచి అనుమతిస్తారా? అని రామభక్తులు ఎదురుచూస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పట్ల భారతదేశంలోనే కాకుండా.. విదేశాల్లో స్థిరపడిన హిందువులు కూడాఎంతో ఆసక్తితో ఉన్నారు. 

ఈ రామమందిర నిర్మాణం అద్భుతమైన హస్తకళ, భారీ ఇంజనీరింగ్‌కు చిహ్నంగా నిలవనుంది. 57,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇంజనీర్లు, హస్తకళాకారులు రాముడి వైభవాన్ని, అయోధ్యకు దాని సహజమైన రూపానికి పునరుద్ధరించడాన్ని నిర్ధారించడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు. అయోధ్యలో అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న రామమందిరం ప్రారంభం తర్వాత  ప్రతిరోజు లక్షలాది మంది భక్తులకు ఆతిథ్యం ఇవ్వనుంది. 

రామ మందిర నిర్మాణ పనులను నిర్వహిస్తున్న కంపెనీలలో ఒకటైన ఎల్ అండ్ టీ ప్రాజెక్ట్ మేనేజర్ వినోద్ కుమార్ మెహతా మాట్లాడుతూ.. 1000 ఏళ్ల పాటు నిలిచి ఉండేలా రామమందిర డిజైన్ చేశామని చెప్పారు. అందుకే కాంక్రీట్, స్టీల్ ఉపయోగించడం  లేదని.. వాటి కాలం చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. అందుకే పూర్తిగా రాతిని ఉపయోగిస్తున్నామని చెప్పారు. 

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ ప్రధాన కార్యదర్శి నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. వీలైనంతా త్వరగా శ్రీరాముని సంగ్రహావలోకనం భక్తులను పొందాలని తాను భావిస్తున్నట్లు చెప్పారు. రామమందిరం నిర్మాణాన్ని ప్లాన్ చేసిన విధానాన్ని కూడా ఆయన వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు