పనిచేసిన బ్యాంకులోనే మాజీ మేనేజర్ దోపిడీ యత్నం.. ఇద్దరిమీద కత్తితో దాడి.. ఒకరు మృతి..

Published : Jul 30, 2021, 02:53 PM IST
పనిచేసిన బ్యాంకులోనే మాజీ మేనేజర్ దోపిడీ యత్నం.. ఇద్దరిమీద కత్తితో దాడి.. ఒకరు మృతి..

సారాంశం

ముంబై నగర సమీపంలోని విరార్ సబర్బన్ ప్రాంతంలోని ఓ బ్యాంకులో అప్పుల్లో మునిగిన ఓ మాజీ మేనేజర్ దోపిడీకి యత్నించిన ఘటన గురువారం రాత్రి జరిగింది. విరార్ సబర్బన్ ప్రాంతంలోని ఐసీఐసీఐ బ్యాంకుకు గురువారం రాత్రి మాజీ మేనేజర్ వచ్చి దోపిడీకి యత్నించాడు.

ముంబై : పనిచేసి మానేసిన బ్యాంకుకే కన్నం వేయాలని చూశాడో మేనేజర్. అంతేకాదు దీనికోసం దారుణానికి తెగబడ్డాడు. తన తరువాత ఆ స్థానంలో ఉన్న మేనేజర్, క్యాషియర్ల మీద కత్తితో దాడిచేసి.. మేనేజర్ మృతికి కారణమయ్యారు. ఈ ఘటన గురువారం రాత్రి ముంబైలో జరిగింది. 

ముంబై నగర సమీపంలోని విరార్ సబర్బన్ ప్రాంతంలోని ఓ బ్యాంకులో అప్పుల్లో మునిగిన ఓ మాజీ మేనేజర్ దోపిడీకి యత్నించిన ఘటన గురువారం రాత్రి జరిగింది. విరార్ సబర్బన్ ప్రాంతంలోని ఐసీఐసీఐ బ్యాంకుకు గురువారం రాత్రి మాజీ మేనేజర్ వచ్చి దోపిడీకి యత్నించాడు.

అడ్డుకున్న ప్రస్తుత బ్యాంకు మేనేజర్ యోగితావార్తక్ (34), క్యాషియర్ శ్వేతా దేవుఖ్ (32)ల మీద కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మేనేజర్ యోగితా మరణించగా, క్యాషియర్ శ్వేతా తీవ్రంగా గాయపడ్డారు. బ్యాంకులో గొడవ విన్న వీధిలోని ప్రజలు వచ్చిన నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

గాయపడిన శ్వేతాను ఆసుపత్రికి తరలించారు. యోగితా మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం తరలించారు. నిందితుడికి భారీగా అప్పులున్నాయని, అవి తీర్చేందుకే బ్యాంకు దోపిడీకి యత్నించాడని పోలీసులు తెలిపారు. విరార్ పోలీసులు నిందితుడిపై ఐసీసీ సెక్షన్ 302,307,397ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

PM Modi: మోదీ నా బిడ్డకు పునర్జన్మనిచ్చారు.. ప్రధానిని దూషించిన బాలిక తల్లి ఎమోషన్
భోగాపురం పర్యటనలో మోదీ సెక్యూరిటీ చూశారా | PM Modi High-Level Security at Bhogapuram Airport