ప్రేమను తిరస్కరించిందని.. జూనియర్ గొంతుకోసిన ఇంజనీరింగ్ విద్యార్థి.. అరెస్ట్...

కర్ణాటకలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బ్లేడ్ తో తన జూనియర్ గొంతు కోశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమను తిరస్కరించినందుకు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. 


కర్ణాటక : కర్ణాటకలో దారుణ ఘటన వెలుగు చూసింది. తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించినందుకు తన జూనియర్‌పై దాడికి పాల్పడ్డాడో ఇంజినీరింగ్ విద్యార్థి. ఆమె గొంతుకోశాడు. ఆ విద్యార్థిని కర్ణాటకలో అరెస్టు చేశారు.

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లోని డాక్టర్ టి తిమ్మయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు ప్రీతం ప్రభుగా గుర్తించారు. ప్రీతం మెకానికల్ ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం విద్యార్థి, అతను 20 సంవత్సరాల వయస్సు గల ఇరిన్ అనే తన జూనియర్‌కు ప్రపోజ్ చేశాడు.

Latest Videos

ఆమె నిరాకరించడంతో, ప్రీతమ్ బ్లేడ్‌తో ఆమెపై దాడి చేసి, ఆమె గొంతుకు గాయమైంది. ఆమెను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లోని ఊర్గాం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.

ఇరిన్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బెంగళూరుకు చెందిన ఇరిన్ తన కళాశాల విద్యను అభ్యసించడానికి తన మామతో కలిసి నివాసం ఉంటుండగా, ప్రీతమ్ కెజిఎఫ్‌లో స్థానిక నివాసి.
 

click me!