శుభవార్త : భారత్ లో రెండు వారాల్లో కరోనా టీకాకు అనుమతి?

Bukka Sumabala   | Asianet News
Published : Dec 08, 2020, 12:57 PM IST
శుభవార్త : భారత్ లో రెండు వారాల్లో కరోనా టీకాకు అనుమతి?

సారాంశం

దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. భారత్ లో అతి త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే విషయంలో డీసీజీఐ రెండు వారాల్లోగా సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. 

దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు. భారత్ లో అతి త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చే విషయంలో డీసీజీఐ రెండు వారాల్లోగా సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి. 

కోవిడ్ టీకాను అత్యవసర  వినియోగ అనుమతినివ్వాలంటూ ఇప్పటికే ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ సంస్థలు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై డీసీజీఐ రెండు వారాల్లోగా సానుకూల నిర్ణయం తీసుకోనున్నట్లు ఆరోగ్య శాఖ వర్గాల సమాచారం.

ఫైజర్, సీరం, భారత్ బయోటెక్ కంపెనీల విజ్ఞప్తులను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్ సీవో)లోని నిపుణుల కమిటీ బుధవారం పరిశీలించనుంది. టీకా పనితీరు, పంపిణీ వంటి అంశాలపై విస్తృతస్థాయిలో చర్చలు జరుపుతుంది. ఈ కమిటీ తమ పరిశీలనలను అందించిన తర్వాత రెండు వారాల్లోగా కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి డీసీపీఐ అనుమతులు కల్పించే అవకాశాలున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 

దేశంలో కొద్ది వారాల్లోనే కోవిడ్ -19 టీకా సిధ్దమవుతుందని ఈ నెల 4న జరిగిన అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా వార్తలు మరింత ఊరటనిస్తున్నాయి.

భారత్ లో టీకా వినియోగానికి అనుమతి కోరిన తొలి సంస్థ ఫైజర్. ఆ తర్వాత సీనరం, భారత్ బయోటెక్ సంస్థలు కూడా సీజీసీఐకు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే అవసరంతో పాటు టీకా భద్రత కూడా ముఖ్యమైన అంశమని, అందుకే అత్యవసరం అనుమతులు ఇచ్చేముందు వ్యాక్సిన్ సామర్థ్యాలు, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

అగ్రరాజ్యం అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసులున్న భారత్ లో మొత్తం కేసుల సంఖ్య కోటికి చేరుతోంది. మంగళవారం నాటికి 97,03,770 మంది వైరస్ బారిన పడగా.. 1,40,958 మంది కోవిడ్ కు బలయ్యారు. దీంతో టీకా పురోగతిపై భారత ప్రభుత్వం గట్టిగా దృష్టి పెట్టింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకే రోజు మూడు నగరాల్లో పర్యటించి వ్యాక్సిన్ ప్రయోగాలను పరిశీలించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే భారత్ లో టీకా అత్యవసర వినియోగ అనుమతులకు దరఖాస్తులు రావడం విశేషం. 

ఇప్పటికే బ్రిటన్ లో ఫైజర్ టీకా అత్యవసరం వినియోగానికి అనుమతి లభించిన విషయం తెలిసిందే. మంగళవారం నుంచే అక్కడ టీకా పంపిణీ ప్రారంభిస్తున్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తికి తొలి టీకా డోసు వేయించుకోనున్నారు. మన దేవంలో కూడ టీకా అందుబాటులోకి వస్తే తొలి ప్రాధాన్యంగా ఆరోగ్య సిబ్బంద, వృద్ధులకు వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది.  

PREV
click me!

Recommended Stories

నామినేషన్‌కు విజయ్ తలపతి పవన్‌ కళ్యాణ్‌ను మించిన ఫాలోయింగ్: Thalapathy Vijay rally | Asianet Telugu
TVK Chief Vijay Files Nomination: విజయ్ నామినేషన్ చెన్నైలో భారీగా ట్రాఫిక్ జామ్| Asianet News Telugu