Elephant Video: మ‌వాటి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టిన గ‌జ‌రాజు.. ప్రాణాలకు తెగించి.. గంగాన‌దిని దాటింది..

By Rajesh K  |  First Published Jul 14, 2022, 12:30 AM IST

Elephant Video: ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్న గంగాన‌దిని ఓ మ‌వాటి త‌న ఏనుగు సాయంతో దాటాడు. దాదాపు 3 కిలో మీటర్ల పాటు ఆ ఏనుగు వీరోచితంగా పోరాడి త‌న మ‌వాటి ప్రాణాల‌కు కాపాడింది.


Elephant Video: ప్ర‌తి అనుభ‌వం.. జీవితానికి ఓ పాఠాన్ని నేర్పిస్తుంది. అలాగే.. ఓ మ‌వాటికి ఓ అనుభ‌వం ఎదురైంది. ఇటీవ‌ల ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న న‌ది ఉప్పొంగుతుంది. నీటి ప్ర‌వాహంలో మవాటి త‌న‌ ఏనుగుతో పాటు చిక్కుక‌పోయారు. స‌హాయం చేయ‌డానికి ద‌రిదాపుల్లో ఎవ్వ‌రూ లేరు. ఎటు చూసినా.. నీటి ప్ర‌వాహ‌మే.. ఆ నీటి ప్ర‌వాహం కూడా క్ర‌మంగా పెరుగుతోంది. ఏమి చేయ‌కుండా అక్క‌డే ఉంటే.. నీట‌మున‌గ‌డం త‌ప్ప‌నిస‌రి. ఈ ప‌రిస్థితుల్లో ఆ మావాటి ఒక్క నిర్ణ‌యానికి వ‌చ్చారు. పోరాడితే పోయేదేమి బానిస సంకెళ్లు త‌ప్ప అట్లుగా.. ఆ నీటి ప్ర‌వాహానికి ఎదురొడ్డి పోరాడాల‌ని నిర్ణ‌యించుకున్నారు. గ‌ర్జిస్తున్న‌ నీటి ప్ర‌వాహానికి ఎదుర్కొవడానికి సిద్ద‌మ‌య్యారు. తన ఏనుగుపై న‌మ్మ‌కం ఉంచి.. ప్ర‌వాహాన్ని ఎదురెళ్లాల్సిందిగా ఆదేశించాడు.

ఆ ఏనుగు మ‌వాటి ఆదేశాల‌ను కాద‌న‌కుండా..  తన ప్రాణం క‌న్న త‌న‌పై న‌మ్మ‌కం పెట్టుకున్న త‌న యాజ‌మాని ప్రాణాల‌ను కాపాడటానికి.. త‌న ధీర‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించింది ఆ ఏనుగు. తన దృఢ సంక‌ల్పంతో ఆ నీటి ప్ర‌వాహాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగింది. ఆ ఏనుగు అడుగుల ముందు.. ఉప్పొంగు అల‌లు ఓడిపోయాయి. చివ‌రికి తన యజమాని త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని ఒమ్ము చేయ‌కుండా.. సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఈ ఘ‌ట‌న బీహార్‌లోని వైశాలిలో వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పుడు ఈ వీడియో తెగ‌వైర‌ల్ అవుతోంది. 

Latest Videos

undefined

ఈ వీడియోలో.. ఓ మావటి త‌న ఏనుగుతో పాటు గంగా నది మధ్యలో చిక్కుకుపోయాడు. వేగంగా ప్ర‌వ‌హించే..  గంగానది ప్రవాహాన్ని ఈ వీడియో చూడ‌వ‌చ్చు. నీటి ప్రవాహం చాలా బలంగా ఉంది, కొన్నిసార్లు ఏనుగు నదిలో మునిగిపోయినట్లు అనిపిస్తుంది. కానీ.. నీటిమునిగిన ప్ర‌తి సారి ఏనుగు పైకి లేస్తూ..  ఏ మాత్రం అధైర్యప‌డ‌కుండా.. అనేక ప్రయత్నాల తర్వాత ఒడ్డుకు చేరుకుంది. త‌న మ‌వాటి ప్రాణాల‌ను కాపాడింది. 
 
ఈ ఘ‌ట‌న రాఘోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రుస్తాంపూర్ ఘాట్ జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది. ఓ వ్య‌క్తి రుస్తాంపూర్ ఘాట్ నుంచి పాట్నాలోని జెతుయ్ ఘాట్‌కు వెళ్లేందుకు త‌న‌ ఏనుగుపై వెళ్లాడు. ఈ క్ర‌మంలో గంగాన‌దిలో నీటి ప్ర‌వాహం ఉదృతమైంది. ఆ వీడియోను చూస్తుంటే.. ఈ నీటి ప్రవాహం వ‌ల్ల ఆ మావాటి మధ్యలోనే నీటిలో మునిగిపోయినట్లు అనిపిస్తుంది, కానీ కొన్ని సెకన్ల తర్వాత అతను తిరిగి ఈత కొట్టడం కనిపిస్తుంది. దాదాపు 3 కిలోమీటరు దూరం ప్రయాణించిన ఏనుగు తన ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా తన యజమానిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఈ వీడియోపై నెటిజ‌న్ల కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. జ‌య‌హో బ‌హుబ‌లి అని కీర్తిస్తున్నారు. 

click me!