కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిశోర్, అధిష్టానానికి నేతల గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఎప్పుడంటే..?

Siva Kodati |  
Published : Apr 22, 2022, 04:36 PM ISTUpdated : Apr 22, 2022, 04:41 PM IST
కాంగ్రెస్‌లోకి ప్రశాంత్ కిశోర్, అధిష్టానానికి నేతల గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఎప్పుడంటే..?

సారాంశం

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేరడం ఖాయమైంది. ఈ మేరకు అధిష్టానం ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన త్వరలోనే హస్తం పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. 

కాంగ్రెస్ పార్టీలో (congress) ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ (prashant kishor) చేరికకు రంగం సిద్దమైంది. మే 7న పీకే హస్తం పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతను ప్రశాంత్‌కు అప్పగించనున్నారు. పీకే చేరికకు సంబంధించి నేతలందరితో సంప్రదింపులు జరిపి, వారి అభిప్రాయాలు స్వీకరించింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదనలకు అందరి ఆమోదం లభించినట్లుగా వార్తలు వస్తున్నాయి. పీకే చేరికతో సరికొత్త రూపును సంతరించుకోనుంది కాంగ్రెస్ పార్టీ. 

కాగా... 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ దేశ రాజకీయాల్లో క్రమంగా దిగజారిపోతూనే ఉన్నది. 2019లోనూ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయింది. రాష్ట్రాల్లోనూ బలాన్ని కోల్పోతున్నది. ఇప్పుడు కేవలం మూడు రాష్ట్రాల్లోనే సొంతంగా అధికారంలో ఉన్నది. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌ను కూడా కోల్పోయిన విషయం విధితమే. ఉత్తరప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ దారుణ వైఫల్యాన్ని మూటగట్టుకోవడంతో 2024 సార్వత్రిక ఎన్నికల టెన్షన్ పుట్టుకుంది. దీంతో ప్రశాంత్ కిశోర్‌తో సంప్రదింపుల జోరు పెంచింది. ఈ
నేపథ్యంలోనే ఎన్నికల వ్యూహకర్త పీకే.. కాంగ్రెస్‌కు కీలక సూచనలు ఇచ్చారు. 

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మరికొందరు సీనియర్ నేతలకు ప్రశాంత్ కిశోర్ 2024 ఎన్నికల కోసం ఆచరించాల్సిన బ్లూ ప్రింట్‌ను ముందు ఉంచారు. ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర, దాని స్థితి గురించి వివరించారు. ఈ బ్లూ ప్రింట్ ప్రకటించడానికి ముందు ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌ ఎట్టిపరిస్థితుల్లో మరణించడానికి వీల్లేదని, దేశంతోపాటు అదీ ఉండాలని పేర్కొన్నారు. 

ప్రశాంత్ కిశోర్ తన బ్లూ ప్రింట్‌లో దేశ జనాభా, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల సంఖ్య, మహిళలు, యువత, చిన్న వ్యాపారులు, రైతుల పట్ల పార్టీ వైఖరిని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, 2024 జనరల్ ఎలక్షన్స్‌లో ఓటు వేయడానికి సిద్ధం అవుతున్న 13 కోట్ల తొలిసారి ఓటేసి నవయువకులనూ ఫోకస్ చేశారు. కాంగ్రెస్‌కు ప్రస్తుతం లోక్‌సభ, రా జ్యసభలో కలిపి కేవలం 90 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారని, దేశవ్యాప్తంగా సుమారు 800 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని వివరించారు. మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నదని, మరో మూడు రాష్ట్రాల్లో పొత్తులతో అధికారంలో ఉన్నదని తెలిపారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నదని పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం