జూలై 18న పోలింగ్: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల

Published : Jun 09, 2022, 03:13 PM ISTUpdated : Jun 09, 2022, 04:02 PM IST
 జూలై 18న పోలింగ్: రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల

సారాంశం

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విడుల చేసింది. వచ్చే నెల 21వ తేదీతో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని సీఈసీ రాజీవ్ కుమార్ చెప్పారు. 

న్యూఢిల్లీ: President Election కు సంబంధించి  Schedule ను గురువారం నాడు CEC  Rajeev Kumar  విడుదల చేశారు.జూన్ 15న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నట్టుగా ఈసీ తెలిపింది. జూన్ 29న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీగా  ఈసీ ప్రకటించింది.జూలై 2న నామినేషన్ల ఉపసంహారణకు చివరి తేదీగా ఈసీ తెలిపింది.  జూలై 18న   పోలింగ్ నిర్వహించనున్నట్టుగా ఈసీ తెలిపింది. జూలై 21న ఓట్ల లెక్కింపును నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. వచ్చే నెల 21వ తేదీతో రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాలని సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు. 

వచ్చే నేల 24వ తేదీతో ప్రస్తుత రాష్ట్రపతి Ramnath Kovind పదవీ కాలం ముగియనుంది.  దీంతో ఎన్నికలను నిర్వహించనున్నారు.  రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎన్నుకుంటారు.రాష్ట్రపతితో పాటు ఉప రాష్ట్రపతిని కూడా ఎన్నుకొంటారు.ఎలక్టోరల్ కాలేజీలో MP, MLA లు సభ్యులుగా ఉంటారు. 

దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అసెంబ్లీలో ఉన్న 4,033 మంది ఎమ్మెల్యేలు, 776 మంది ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 776 ఎంపీల ఓటు విలువ 5,43,200లు, ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ 5,43,231.ఎంపీ, ఎమ్మెల్యేల ఓటు విలువ 10,86,431గా ఈసీ ప్రకటించింది.

ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేల ఓటు విలువ ఓక్కో రాష్ట్రానికి మారుతూ ఉంటుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన  ఎమ్మెల్యేల ఓటు విలువ ఎక్కువ 
ఎక్కువగా ఉంటుంది.  యూపీ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ ఎక్కువగా ఉంటుంది. 

రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం  దక్కించుకోవాలంటే 5,49, 452 ఓట్లు కావాలి. ఎన్డీఏ కూటమికి 9 వేల ఓట్లు తక్కువగా ఉన్నాయి. బీజేడీ, వైసీపీ వంటి పార్టీలు ఎన్డీఏకు మద్దతిస్తాయా లేదా అనే విషయం త్వరలోనే తేలనుంది. ఒక్క ఎంపీ ఓటు విలువ 700. అత్యధికంగా యూపీలో ఎమ్మెల్యే ఓటు విలువ 208గా ఉంది.. ఎలక్టోరల్‌ కాలేజీలో ఎన్డీయేకు 49 శాతం ఓట్లు ఉన్నాయి. యూపీఏకు 24.02 శాతం, ఇతర పార్టీలకు 26.98 శాతం ఓట్లు ఉన్నాయి.

also read:త్వ‌ర‌లో రాష్ట్రప‌తి ఎన్నికలు.. 2 రోజుల్లో నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న ఎన్నిక‌ల క‌మిష‌న్

రాష్ట్రపతి ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహిస్తారు. ఓటింగ్ సమయంలో పెన్నును ఉపయోగిస్తారు.ఈ పెన్నును ఎన్నికల సంఘం అందించనుంది. తొలిసారిగా ఈ పెన్నును ఎన్నికలకు ఉపయోగిస్తున్నట్టుగా ఈసీ తెలిపింది. వేరే పెన్నును ఉపయోగిస్తే  ఓటు చెల్లుబాటు కాదని కూడా సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.

2017 జూలై 17న రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించారు. 2017 జూలై 17న పోలింగ్ నిర్వహించారు. జూలై 20న కౌంటింగ్ జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షకూటమి లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలోకి దింపింది.  ఎన్డీఏ రామ్‌నాథ్ కోవింద్ ను బరిలోకి దింపింది.  రామ్‌పాథ్ కోవింద్ కు 6,61,278 ఓట్లు రాగా, మీరాకుమార్ కి 4,34,21 ఓట్లు వచ్చాయి. 

 


 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం