ఎలక్షన్ టైం: అసెంబ్లీ ఎన్నికల డేట్లను ప్రకటించనున్న  ఎన్నికల సంఘం

Published : Sep 21, 2019, 11:50 AM IST
ఎలక్షన్ టైం: అసెంబ్లీ ఎన్నికల డేట్లను ప్రకటించనున్న  ఎన్నికల సంఘం

సారాంశం

హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీల గడువు ఈ నవంబర్ తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నేటి మధ్యాహ్నం ప్రెస్ మీట్ నిర్వహించనుంది,.

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీల గడువు నవంబర్ లో ముగియనుంది. 288 సీట్లు కలిగిన మహారాష్ట్ర అసెంబ్లీ  గడువు ఈ సంవత్సరం నవంబర్ 9 తో ముగుస్తుంది. హర్యానా అసెంబ్లీ గడువు నవంబర్ 2వ తేదీతో ముగుస్తుంది. 

ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ గడువులు ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సిన సమయం ఆసన్నమయింది. దీనికి సంబంధించి నేటి మధ్యాహ్నం ఎలక్షన్ కమిషన్ ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రకటించనున్నారు. 

రాజకీయపార్టీలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి. పొత్తులు కుదుర్చుకొని సీట్ల పంపకాలు కూడా చేసుకుంటున్నాయి. కెసిఆర్ లాంటి నాయకులు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోకి ఎంటర్ అయ్యి తమ లుక్కును పరీక్షించుకునేందుకు సిద్దపడుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం