
న్యూఢిల్లీ: బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.
బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించనున్నారు. దేశంలోని 65 స్థానాలకు ఉపఎన్నికలు కూడ నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.
బీహార్ అసెంబ్లీతో పాటు 65 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలను సరైన త్వరలోనే ఈసీ షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.ఈ ఏడాది బీహార్ రాష్ట్రానికి నవంబర్ 29వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో ఈ ఏడాది అక్టోబర్లేదా నవంబర్ మాసంలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్లాన్ చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని దుబ్బాక అసెంబ్లీ స్థానానికి కూడ ఉఫ ఎన్నికలు నిర్వహించనున్నారు. అనారోగ్య కారణాలతో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గత నెలలో మరణించారు. రామలింగారెడ్డి మరణంతో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.