
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ బుధవారం మధ్యాహ్నం కొద్ది సేపు వణికిపోయింది. నేపాల్‌లో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రకంపనలు ఢిల్లీ, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ కనిపించాయి. ఢిల్లీ ఎన్సీఆర్‌తోపాటు యూపీ, ఉత్తరాఖండ్, హర్యానాలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి.
నేపాల్‌లో జుమ్లా నుంచి 69 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకారం, బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నది. ఈ భూకంపంలో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం ఏదీ అందలేదు.
Also Read: సూర్యాపేట జిల్లాలో భూకంపం: రిక్టర్ స్కేల్‌పై 3.2 గా తీవ్రత నమోదు
గత కొన్ని నెలలుగా నేపాల్‌లో తరుచూ భూకంపాలు వస్తున్నాయి. గతంలో గత నెల 24వ తేదీన 5.8 తీవ్రతతో భూమి కంపించింది. గతేడాది నవంబర్‌లో ఈ దేశంలో 6.3 తీవ్రతతో భూమి కంపించగా కనీసం ఆరుగురు మరణించారు.
టర్కీ దేశాన్ని వరుస భూకంపాలు కుదిపేసిన సంగతి తెలిసిందే.