ఆఫ్గనిస్తాన్‌లో భూకంపం.. జమ్ము కశ్మీర్‌లో ప్రకంపనలు.. 5.1 తీవ్రతతో కంపించిన భూమి

Published : Jun 14, 2022, 05:29 PM IST
ఆఫ్గనిస్తాన్‌లో భూకంపం.. జమ్ము కశ్మీర్‌లో ప్రకంపనలు.. 5.1 తీవ్రతతో కంపించిన భూమి

సారాంశం

మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఆఫ్గనిస్తాన్‌లో భూమి కంపించింది. దీని ప్రకంపనలు జమ్ము కశ్మీర్‌లో కనిపించాయి. రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రతతో భూమి కంపించినట్టు అధికారులు తెలిపారు.

న్యూఢిల్లీ: ఈ రోజు ఉదయం ఆఫ్గనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం మధ్యాహ్నం రిక్టర్ స్కేల్ పై 5.1 తీవ్రతతో ఆఫ్గనిస్తాన్‌లో భూకంపం వచ్చింది. ఈ భూకంపం ప్రకంపనాలు జమ్ము కశ్మీర్‌లో కనిపించాయి. జమ్ము కశ్మీర్‌లో మంగళవారం మధ్యాహ్నం భూకంప ప్రకంపనాలు వచ్చాయి.

నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్కారం, మధ్యాహ్నం 1.05 గంటలకు భూమి కంపించింది. లాటిట్యూడ్ 36.42, లాంగిట్యూట్ 71.23ల వద్ద 180 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్టు వివరించింది. ఆఫ్గనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు నైరుతి వైపు 96 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంప కేంద్రం ఉన్నది. అయితే, ఈ భూకంప ఘటనలు ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్టు వార్తలు రాలేదు.

ఇదిలా ఉండగా, అండమాన్ సముద్రంలో ఆదివారం భూకంపం సంబంధించింది. మధ్యాహ్నం 2:21 గంటల ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్ర‌త‌ 4.6 గా నమోదైన‌ట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలియ‌జేసింది. పోర్ట్ బ్లెయిర్ సమీపంలోని అండమాన్ సముద్రంలో 40 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ఒక ట్వీట్‌లో తెలియ‌జేశారు. అయితే, ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్ట వివరాల‌ను పేర్కొనలేదు.  

అయితే, ఈ భూకంపం వ‌ల్ల అండమాన్ సముద్రంలో సునామీని సృష్టించే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. 
 
అలాగే.. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్‌ ప్రాంతంలో శనివారం కూడా అదే స్థాయిలో భూకంపం సంభవించింది. ఇదిలాఉంటే.. టోంగా దీవుల్లో ఆదివారం ఉద‌యం వరుసగా 5.9 , 6.2 తీవ్రతతో రెండు భూకంపం సంభవించిన‌ట్టు  నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

NCS ఇటీవల ఏప్రిల్‌లో సంభవించిన భూకంపాల నివేదికను విడుదల చేసింది. ఏప్రిల్ 1 నుండి 30వ తేదీ వరకు మొత్తం 81 భూకంపాలు నమోదయ్యాయని పేర్కొంది. వాటిలో 73 భూకంపాలు భారతదేశం మరియు దాని పొరుగు ప్రాంతంలో సంభవించాయని పేర్కొంది
  
ఇందులో అత్యధిక భూకంపాలు హిందూ కుష్ ప్రాంతం, లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, ఉత్తరాఖండ్, అండమాన్ సముద్రం సహా అండమాన్ మరియు నికోబార్ దీవుల ప్రాంతంలో భూకంపాలు సంభ‌వించిన‌ట్టు నివేదికలో పేర్కొంది.

హర్యానాలోని రోహ్‌తక్ , ఒడిషాలోని గంజాం , కర్ణాటకలోని బీజాపూర్, చిక్కబళ్లాపుర, ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు, కేరళలోని కొల్లాం, తమిళనాడులోని దిండిగల్ ల్లో  చిన్నపాటి భూకంపాలు న‌మోదైన‌ట్టు నివేదిక‌లో పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu