జమ్మూ కశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత..

Published : Apr 12, 2023, 11:08 AM ISTUpdated : Apr 12, 2023, 11:19 AM IST
జమ్మూ కశ్మీర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత..

సారాంశం

జమ్మూకశ్మీర్‌లో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0 గా నమోదైంది.

జమ్మూకశ్మీర్‌లో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.0 గా నమోదైంది. ఈరోజు ఉదయం 10.10 గంటలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోస్టు చేసింది. భూకంప కేంద్రం లోతు 10 కి.మీ ఉందని తెలిపింది. అయితే భూకంపం వల్ల ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్టుగా  నివేదికలు వెలువడలేదు.


 


ఇదిలా ఉంటే.. ఈరోజు ఉదయం బీహార్‌లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.3 గా నమోదైంది. ఉదయం 5.35 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపంలో ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సీఎస్) ప్రకారం.. పూర్నియా సమీపంలో భూమికి 10 కి.మీ దిగువన భూకంపం కేంద్రీకృతమై ఉంది. కతిహార్‌తో పాటు అరారియా పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం