అండమాన్ నికోబార్ దీవుల్లో బుధవారం తెల్లవారుజామున 5.40 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.0గా నమోదు అయ్యింది.
అండమాన్ నికోబార్ దీవుల్లో మళ్లీ భూకంపం సంభవించింది. బుధవారం తెల్లవారు జామున 5.40 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.0గా నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. గడిచిన 5 రోజుల్లోనే ఈ ప్రాంతంలో సంభవించిన రెండో భూకంపం ఇది.
ఇంతకు ముందు జులై 29న అర్ధరాత్రి 12.53 గంటలకు ఈ అండమాన్ దీవుల్లో భూమి కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.8గా నమోదు అయ్యింది. ఈ భూకంపం 69 కిలోమీటర్ల లోతులో సంభవించిందని ఎన్సీఎస్ తెలిపింది.
An earthquake of magnitude 5.0 on the Richter Scale hit Nicobar Islands today at around 5:40 am: National Centre for Seismology pic.twitter.com/VOyw7RKfHm
— ANI (@ANI)కాగా.. జులై 9వ తేదీన కూడా అండమాన్ నికోబార్ దీవుల్లోని క్యాంప్ బెల్ బే ఆగ్నేయ ప్రాంతంలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు ఎన్ సీఎస్ పేర్కొంది.