Budget 2022: విదేశాలకు ప్రయాణం చేసే పౌరుల సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కొత్తగా ఈ-పాస్‌పోర్ట్(E-passport) ను తీసుకువస్తున్నట్లు మంగళవారం కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
Budget 2022: విదేశాలకు ప్రయాణాలు చేసే వారికి మరింత సౌలభ్యం కోసం వచ్చే ఏడాది నుంచి ఈ-పాస్‌పోర్ట్‌లను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2019లో తొలిసారి ఈ విధానాన్ని కేంద్రం ప్రకటించినప్పటికీ అది అమలు కాలేదు. ఈ ఏడాది నుంచే వీటి జారీని ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
పాస్‌పోర్ట్‌లు అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. ఈ-పాస్‌పోర్ట్‌లో ఎంబెడెడ్ చిప్స్ ఉంటాయని, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని ఉపయోగిస్తామని తెలిపారు. కొత్త విధానం వల్ల ప్రయాణికులకు ఎంతో భద్రత, ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. ఇ-పాస్‌పోర్ట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇమ్మిగ్రేషన్ పోస్ట్‌ల ద్వారా సాఫీగా వెళ్లేందుకు వీలు కల్పిస్తుందని, బయోమెట్రిక్ డేటాపై ఆధారపడినందున మరింత భద్రతను అందిస్తుంది. ఈ సందర్భంగా ఈ-పాస్‌పోర్ట్ ప్రధాన ఫీచర్లను మంత్రి వెల్లడించారు.
E-Passport ప్రత్యేకతలు
ఈ-పాస్‌పోర్ట్‌లలో అత్యంత భద్రతా లక్షణాలున్నాయి. రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ మరియు బయోమెట్రిక్‌లను ఉపయోగిస్తాయి. ఈ -పాస్ పోర్టు ను సులువుగా, చాలా తక్కువ సమయంలో యాక్సెస్ చేయవచ్చు. ఈ-పాస్‌పోర్ట్ వెనక భాగంలో చిన్న సిలికాన్ చిప్ ఉంటుంది. ఈ చిప్‌లోనే పాస్‌పోర్టుదారుడి ఫొటో, ఫింగర్ ప్రింట్‌తో సహా అన్ని వివరాలు ఉంటాయి. దీంతో గత ప్రయాణాల వివరాలు కూడా ఇందులో నిల్వ ఉంటాయి. ఎవరైనా చిప్‌ని ట్యాంపర్ చేస్తే.. సిస్టమ్ దానిని గుర్తించవచ్చు. అంతేగాక అమెరికాలోని ప్రముఖ లేబొరేటరీలో మొదట ఈ ఈ-పాస్‌పోర్ట్ నమూనాను పూర్తిగా పరీక్షించి, ఎలాంటి లోటుపాట్లు లేవని తేలిన తర్వాతే వాడకంలోకి అనుమతిస్తారు.
ఇ-పాస్‌పోర్ట్‌ల తయారీని దృష్టిలో ఉంచుకుని.. ఇండియా సెక్యూరిటీ ప్రెస్, చిప్-ఎనేబుల్డ్ ఇ-పాస్‌పోర్ట్‌లకు అవసరమైన దాని ఆపరేటింగ్ సిస్టమ్‌తో పాటు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO)-కంప్లైంట్ ఎలక్ట్రానిక్ కాంటాక్ట్‌లెస్ ఇన్‌లేల సేకరణ కోసం ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇ- పాస్‌పోర్టుల ద్వారా ప్రయాణాలకు సమయం చాలా ఆదా అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.