డెలివరీ బాయ్ సాహసం... ఫుడ్ డెలివర్ చేయడానికి ఏం చేశాడంటే...!

Published : Sep 16, 2022, 09:43 AM IST
 డెలివరీ బాయ్ సాహసం... ఫుడ్ డెలివర్ చేయడానికి ఏం చేశాడంటే...!

సారాంశం

ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్ ని ఆమెకు అందించడానికి డెలివరీ బాయ్ సాహసం చేశాడు. రైలు కదులుతుంటే.. పరిగెత్తుకుంటూ వెళ్లి.. డెలివరీ అందించాడు. 


డెలివరీ బాయ్ పనేంటి...? మనం ఆర్డర్ చేసుకున్న ఫుడ్ లేదంటే... ఏవైనా వస్తువులు మన ఇంటికి చేరుస్తూ ఉంటారు.  చాలా మంది కష్టమర్లు.. కొందరు డెలివరీ బాయ్స్ చేస్తున్న పనులపై ఫిర్యాదులు చేసిన వార్తలు మనం చాలానే చూశాం. అయితే... ఈ డెలివరీ బాయ్ నిచూస్తే మాత్రం.. ఎవరైనా సలాం చెప్పాల్సిందే. అతని డెడికేషన్ లెవల్స్ ని నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు.

 

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.... వివిధ రకాల వస్తువులను హోమ్ డెలివరీ అందించే డంజో గురించి తెలిసే ఉంటుంది. ఈ డంజోలో మనలో చాలా మంది ఫుడ్స్ ఆర్డర్ చేసి ఉంటాం. కాగా... ఓ మహిళ కూడా అలానే ఆర్డర్ చేసింది. అయితే.. ఆమె ఆర్డర్ చేసిన ఫుడ్ ని ఆమెకు అందించడానికి డెలివరీ బాయ్ సాహసం చేశాడు. రైలు కదులుతుంటే.. పరిగెత్తుకుంటూ వెళ్లి.. డెలివరీ అందించాడు. ఈ సంఘటనన ముంబయిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ వీడియోలో డంజో డెలివరీ బాయ్ స్టేషన్ లో పరుగెత్తుకుంటూ కనిపించాడు. అప్పటికే ప్లాట్ ఫాం పై రైలు కదులుతూ ఉంది. క్రమంగా రైలు వేగం పెంచుకుంది. అంతలోనే డెలివరీ బాయ్ ఫుడ్ బ్యాగ్ తో పరిగెత్తుకుంటూ వచ్చి.. రైలులో డోర్ దగ్గర నిలపడిన మహిళకు అందించాడు. అతను కాస్త వేగం తగ్గించినా.. రైలు వెళ్లిపోయేది. కానీ.. అతను వేగంగా పరిగెత్తి మరీ ఆమెకు అందించాడు. దీంతో... సదరు మహిళ చాలా సంతోషించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం