మద్యం మత్తులో డ్రైవింగ్.. రోడ్డు మధ్యలో కారు ఆపేసి నిద్రలోకి జారుకున్న మందుబాబు..!

Published : Oct 02, 2022, 12:51 PM IST
మద్యం మత్తులో డ్రైవింగ్.. రోడ్డు మధ్యలో కారు ఆపేసి నిద్రలోకి జారుకున్న మందుబాబు..!

సారాంశం

మందుబాబులు ఫుల్‌గా మద్యం తాగిన ఏం చేస్తారో వారికే తెలియదు. మద్యం మత్తులో నానా రచ్చ చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును రోడ్డు మధ్యలో ఆపేసి.. నిద్రలోకి జారుకున్నాడు. 

మందుబాబులు ఫుల్‌గా మద్యం తాగిన ఏం చేస్తారో వారికే తెలియదు. మద్యం మత్తులో నానా రచ్చ చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉంటాం. తాజాగా మద్యం మత్తులో ఓ వ్యక్తి కారును రోడ్డు మధ్యలో ఆపేసి.. నిద్రలోకి జారుకున్నాడు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటన కర్ణాటలోని మడికేరి పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. శుక్రవారం మడికేరి‌లోని ఓ వైన్ షాప్‌లో మద్యం తాగిన వ్యక్తి.. తర్వాత కారులో అక్కడి నుంచి బయలుదేరాడు. 

అయితే కొద్దిదూరం కారు నడిపిన అతడు.. అనంతరం రోడ్డు మధ్యలో కారును ఆపేశాడు. కారులోనే నిద్రపోయాడు. దీంతో ఆ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇందుకు సంబంధించి సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దాడు. ఈ ఘటనకు సంబంధించి రోడ్డుపై కారు నిలిపిన మందుబాబుపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

దేశంలో బెస్ట్ ప్రధాని ఎవరు? సీఎంలలో ఆ ముగ్గురే తోపు | Best Prime Minister of India | Best CM
ట్రైన్ లో వాటర్ ఎలా సప్లై అవుతుంది? నీళ్లు ఎక్కడ స్టోర్ చేస్తారు? | Railway Quick Watering System