పీకలదాకా తాగి, రైల్వే ట్రాక్ పై కారు నడిపాడు..!

Published : Jul 22, 2023, 11:22 AM IST
  పీకలదాకా తాగి, రైల్వే ట్రాక్ పై కారు నడిపాడు..!

సారాంశం

ఆ మత్తులో ఎక్కడ వాహనం నడుపుతున్నాడో కూడా తెలీకుండా ప్రవర్తించాడు. కాగా,  అతనిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విచిత్రమైన ఘటన జూలై 18న చోటుచేసుకుంది.  

మద్యం సేవించి వాహనం నడపడమే కరెక్ట్ కాదు. అలాంటిది ఓ వ్యక్తి పీకలదాకా మద్యం సేవించి, ఆ తర్వాత రైల్వే ట్రాక్ పై కారు నడిపాడు.దాదాపు 15 కిలోమీటర్లు ట్రాక్ పై కారు నపడటం విశేషం. ఈ సంఘటన కేరళలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కేరళకు చెందిన జయప్రకాషన్ అనే 45ఏళ్ల వ్యక్తి విపరీతంగా మద్యం సేవించి, ఆ మత్తులో ఎక్కడ వాహనం నడుపుతున్నాడో కూడా తెలీకుండా ప్రవర్తించాడు. కాగా,  అతనిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విచిత్రమైన ఘటన జూలై 18న చోటుచేసుకుంది.

పోలీసులు జూలై 19న అతని వాంగ్మూలాన్ని నమోదు చేసి, బెయిల్‌పై విడుదల చేయడానికి ముందు అతని కారును స్వాధీనం చేసుకున్నారు. మోటారు వాహన చట్టం, 1988లోని సెక్షన్ 185, రైల్వే చట్టంలోని సెక్షన్ల కింద అతనిపై అభియోగాలు మోపారు.

"అతను మద్యం తాగి ఉన్నాడు.ఆ మత్తులో రైల్వే ట్రాక్ పై కారు నడిపినట్లు తెలుస్తోంది" అని పోలీసులు తెలిపారు. రైల్వే గేట్‌కీపర్‌, కొందరు స్థానికులు రైలు పట్టాలపై ఇరుక్కుని ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంభావ్య రైల్వే విపత్తును నివారించడానికి వాహనాన్ని ట్రాక్‌ల నుండి దూరంగా నెట్టడం ద్వారా వారు ఆయనను కాపాడటం విశేషం.

నగర పరిధిలోని తాజా చొవ్వా రైల్వే గేట్ సమీపంలో రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. జయప్రకాష్ బెయిల్‌పై విడుదలైనప్పటికీ ఆయన కారును సీజ్ చేశారు. దానిని కోర్టులో హాజరు పరచనున్నారు.

PREV
click me!

Recommended Stories

Maruti Suzuki S-Presso : మీ శాలరీ రూ.25,000 అయినా సరే.. ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ