దారుణం : భర్తను రోకలి బండతో కొట్టి.. బావిలో తోసి...

Published : Jul 21, 2021, 02:56 PM IST
దారుణం : భర్తను రోకలి బండతో కొట్టి.. బావిలో తోసి...

సారాంశం

రెండు రోజులుగా పాండ్యన్ ఇంటికి రాకపోవడంతో బంధువులు అతని కోసం గాలించారు. ఇంటి సమీపంలోని బావి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బావిలో చూడగా పాండియన్ శవంగా కనిపించాడు.

తమిళనాడు : భర్తను రోకలిబండతో కొట్టి బావిలో తోసి హత్య చేసిన భార్యను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తిరువారూరు జిల్లా పరవకోటై స్వామినాథన్ వీధికి చెందిన పాండ్యన్ (45), మహేశ్వరి (40) దంపతులు. పాండ్యన్ రోజూ మద్యం తాగి భార్యను చిత్రహింసలు చేస్తున్నట్లు తెలిసింది.

ఈ క్రమంలో రెండు రోజులుగా పాండ్యన్ ఇంటికి రాకపోవడంతో బంధువులు అతని కోసం గాలించారు. ఇంటి సమీపంలోని బావి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని బావిలో చూడగా పాండియన్ శవంగా కనిపించాడు.

దీనిమీద పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేశారు. మహేశ్వరి భర్తను రోకలితో దాడి చేసి బావిలోకి తోసినట్టు తెలిసింది. 

ఎల్ ఐకేటీసీ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ చిదంబర నగర్ కు చెందిన కోవిల్ పిచ్చయ్ భార్య ఉష (50) మంగళవారం ఉదయం ఇంట్లో తీవ్ర గాయాలతో శవంగా పడి ఉంది. సమాచారం అందుకున్న పాలై తాలూకా పోలీసు ఇన్ స్పెక్టర్ బాలకృష్ణ, ఎస్ఐ వాసుదేవన్ అక్కడికి చేరుకుని విచారణ చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo