
భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము.. మరికాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మునికి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నమస్కరించారు. ఇక, ద్రౌపది ముర్ము ఉదయం 9.22 గంటలకు రాష్ట్రపతి భవనానికి చేరుకుంటారు. రాష్ట్రపతి భవన్‌లోని ఫోర్‌కోర్టులో వేడుకలు నిర్వహించనున్నారు. ఒకవేళ వర్షం పడితే ఆ వేడుకలు జరగకపోవచ్చు. ఈ వేడుకల్లో ద్రౌపది ముర్ము, రామ్‌నాథ్ కోవింద్‌లు గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం వారు అక్కడి నుంచి పార్లమెంట్‌కు బయలుదేరుతారు.
పార్లమెంట్‌కు చేరుకున్న ద్రౌపది ముర్మును.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సెంట్రల్ హాల్‌కు తీసుకువెళతారు. ద్రౌపది ముర్ము అక్కడికి చేరుకున్న తర్వాత సెంట్రల్ హాల్‌లో జాతీయ గీతం ప్లే చేయబడుతుంది.
ఉదయం 10.15 గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభం కానుంది. ఆమెతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆమె ఓత్ రిజిస్టర్‌పై సంతకం చేస్తారు. ఉదయం 10:23 గంటలకు సెంట్రల్ హాల్‌లో భారత 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన మొదటి ప్రసంగం చేయున్నారు. ద్రౌపది ముర్ము ఉదయం 10:57 గంటలకు ఊరేగింపుగా రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. ఇక,
ఇక, దేశంలోని అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎన్నికైన తొలి గిరిజన నాయకురాలిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపడుతున్న రెండో మహిళగా కూడా నిలవనున్నారు.