
రువనంతపురం:Kerala రాష్ట్రంలోని Malappuramలో Foot ball మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలో గ్యాలరీ కుప్పకూలి పలువురికి గాయాలయ్యాయి. శనివారం నాడు రాత్రి మలప్పురంలోని వండూరులోని సెవెన్స్ పుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా తాత్కాలిక గ్యాలరీ కుప్పకూలింది. డీంతో డజన్ల కొద్దీ గాయపడ్డారు. గాయపడిన వారిని వండూరు పరిసర ప్రాంతాల్లోని పలు ఆసుపత్రుల్లో చేర్పించారు. ముగ్గురిని మంజేరిలోని ప్రభుత్వ వైద్య కాలేజీలో చేర్పించారు.
పుట్ బాల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్యాలరీ కుప్పకూలింది., ఇందులో వెయ్యి మందికి పైగా ఉన్నారని పోలీసులు చెప్పారు. రెండు రోజులుగా ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే పుట్ బాల్ మ్యాచ్ కోసం ఏర్పాటు వెదురు బొంగులు, పలకలతో ఏర్పాటు చేసిన గ్యాలరీ కుప్పకూలింది. గాయపడిన వారిలో పలువురు కాళ్లు, చేతులు విరిగిపోయాయి. గాయపడిన వారి సంఖ్య వంద కంటే ఎక్కువ మంది ఉన్నారు.