సైనికుల ఫోటోలు ఉపయోగించడంపై... పార్టీలకు ఈసీ వార్నింగ్

By Siva KodatiFirst Published Mar 10, 2019, 4:51 PM IST
Highlights

రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార సమయంలో సైనికుల ఫోటోలను ప్రదర్శించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార సమయంలో సైనికుల ఫోటోలను ప్రదర్శించొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఐఏఎఫ్ పైలట్ అభినందన్ వర్ధమాన్, బీజేపీ నాయకులతో కూడిన హోర్డింగ్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.

ఇది ఎన్నికల సంఘం దృష్టికి రావడంతో ఈసీ సీరియస్ అయ్యింది. సైనికుల చిత్రాలను రాజకీయ నాయకులు, అభ్యర్థులు వాడుకుంటున్నారని దీనిని నియంత్రించేందుకు తగిన ఆదేశాలు జారీ చేయాల్సిందిగా రక్షణ మంత్రిత్వ శాఖ ఎన్నికల సంఘాన్ని కోరింది.

దీనిపై స్పందించిన ఈసీ .. ప్రచార చిత్రాలు, హోర్డింగ్‌లలో సైనిక సిబ్బంది ఫోటోలు లేకుండా చూడాలని 2013లోనూ అన్ని పార్టీలకు సూచించింది. 

click me!