ఫిబ్రవరిలో భారత్‌కు ట్రంప్: పలు కీలక ఒప్పందాలు

By narsimha lodeFirst Published Jan 28, 2020, 2:58 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో పర్యటించనున్నారు. 


వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు భారత్‌లో పర్యటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది.భారత్‌‌తో అమెరికా ప్రభుత్వం పలు విషయాలపైచర్చలు జరిపే అవకాశం ఉందని  సమాచారం.

Also read:అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడి: కీలక ప్రకటన చేసిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంపం తొలిసారిగా ఇండియా పర్యటనకు రానున్నారు. ట్రంప్ బస చేసేందుకు న్యూఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్‌ను బుక్ చేశారు. ఈ హోటల్‌లోని  ప్రెసిడెన్షియల్ సూట్‌ను బుక్ చేశారు. ఈ మేరకు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, ఇండియా ప్రధాని మోడీ అహ్మదాబాద్ వేదికగా ద్వైపాక్షిక చర్యలు జరిపే అవకాశం ఉంది.  అయితే ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. 
ఈ పర్యటనలో  ట్రంప్‌ రెండు దేశాల మధ్య పలు వాణిజ్య ఒప్పందాలతో పాటు ఇండో ఫసిఫిక్‌, అప్ఘనిస్తాన్‌, ఇరాన్‌ ప్రాంతాలలో పెట్రేగిపోతున్న ఉగ్రవాదంపై చర్చించనున్నారు. 

 చైనాతో తొలి దశ ఒప్పందంపై సంతకం చేసిన ట్రంప్ భారత్‌తోనూ ఆ తరహా విధానాన్ని అమలు చేసేందుకు చర్చలు  జరిపే అవకాశం ఉందని సమాచారం.దీంతో పాటు యుఎస్ నుంచి 5.6 బిలియన్ డాలర్ల ఎగుమతులపై సున్నా సుంకాలను అనుమతించే జనరలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ (జీఎస్పీ)పై ట్రంప్, మోడీలు చర్చించే అవకాశం ఉంది.

జీఎస్పీ ఉపసంహరణ తర్వాత భారతదేశం తన సుంకాలను వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. వాణిజ్య లోటును తగ్గించడానికి భారత్‌ 6 బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ వస్తువులను కొనుగోలు చేయాలని అమెరికా కోరుకుంటుండగా, ఈ ఒప్పందాన్ని అధిగమించడానికి చమురు లేదా షెల్ గ్యాస్‌పై హామీలు పొందాలని భారత్‌ భావిస్తుంది.

కాగా ఫిబ్రవరి 24 నుంచి మార్చి 30 వరకు జెనీవాలో ఐరాస మానవహక్కుల మండలిలో(యూఎన్‌హెచ్‌ఆర్సీ) సెషన్‌లో భారత్‌పై మాటల యుద్దం చేసేందుకు పాక్‌ సిద్ధమవుతోంది. అదే సమయంలో ట్రంప్‌ భారత్ లో  పర్యటిస్తున్నారు. 

ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది. మోదీ పాలనలో ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం, ఎన్నార్సీ(జాతీయ పౌర పట్టిక), ఎన్పీఆర్‌ వంటి నిర్ణయాల వల్ల భారతీయ ముస్లింలు ముప్పులో ఉన్నారన్న అంశాన్ని పాక్‌ మండలిలో లేవనెత్తే అవకాశం ఉందని  ప్రచారం సాగుతోంది.
 

click me!