కారుకి కుక్కని కట్టి లాక్కెళ్లిన డ్రైవర్.. అరెస్ట్

Published : Dec 12, 2020, 09:44 AM ISTUpdated : Dec 12, 2020, 09:58 AM IST
కారుకి కుక్కని కట్టి లాక్కెళ్లిన డ్రైవర్.. అరెస్ట్

సారాంశం

నిందితుడిని ఏర్నాకులానికి చెందిన యూసూఫ్ గా గుర్తించారు. అతను ఆ కారుకి యజమాని కాగా.. కుక్కని లాక్కెళ్లే సమయంలో కారు డ్రైవ్ చేసింది కూడా అతనే కావడం గమనార్హం. 

ఓ వ్యక్తి కారుకి కుక్కని కట్టి.. లాక్కెళ్లాడు. ఈ దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకోగా..  సదరు డ్రైవర్ ని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళలోని ఎర్నాకులం ప్రాంతానికి చెందిన ఓ 62ఏళ్ల వ్యక్తి... తన కారుకి కుక్కని కట్టి లాక్కెళ్లాడు. కాగా..  దీనిని స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వీడియో కాస్త వైరల్ గా మారింది.

దీంతో.. పోలీసులు ఈ విషయంలో కలగజేసుకొని.. సదరు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఏర్నాకులానికి చెందిన యూసూఫ్ గా గుర్తించారు. అతను ఆ కారుకి యజమాని కాగా.. కుక్కని లాక్కెళ్లే సమయంలో కారు డ్రైవ్ చేసింది కూడా అతనే కావడం గమనార్హం. 

ఆ కుక్క అతను పెంచుకునేది కాదని పోలీసుల దర్యాప్తు లో తేలింది. ఆ కుక్క అతని ఇంటికి సమీపంలో ఉంటుందని.. అది చేస్తున్న న్యూసెన్స్ తట్టుకోలేక.. దానిని వేరే ప్రాంతంలో వదిలిపెట్టాలనే ఉద్దేశంతో అతను ఆ పనిచేసినట్లు తెలిసింది. అయితే.. కుక్కను అలా హింసించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

PREV
click me!

Recommended Stories

మృత‌దేహం ప్రైవేట్ పార్ట్స్‌పై MBBS విద్యార్థిని పిచ్చి మాట‌లు.. కేసు న‌మోదు, అస‌లేం జ‌రిగిందంటే?
CM Vijay Lands in Mangaluru: మంగళూరు ఎయిర్ పోర్ట్ లోసీఎం విజయ్ కి ఘానా స్వాగతం | Asianet News Telugu