రోడ్డు ప్రమాదంలో డీఎంకే ఎంపీ కుమారుడు మృతి..

Published : Mar 10, 2022, 12:58 PM IST
రోడ్డు ప్రమాదంలో డీఎంకే ఎంపీ కుమారుడు మృతి..

సారాంశం

డీఎంకే ఎంపీ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీనీ మీద పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు. 

చెన్నై : తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో అధికార డీఎంకే (ద్రవిడ మున్నేట కజకం) పార్టీకి చెందిన ఎంపీ కుమారుడు రాకేష్ (22) మృత్యువాతపడ్డాడు. వివరాల ప్రకారం.. డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఎన్ఆర్ ఇళంగోవన్ కుమారుడు రాకేష్ పుదుచ్చేరి నుంచి చెన్నై వెళ్తుండగా.. కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రాకేష్ ఘటన స్థలంలోనే అక్కడికక్కడే మృతి చెందగా.. అతడితో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.  

రోడ్డు ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రోడ్డుపై ఉన్న కారును తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.  గాయపడిన వ్యక్తిని సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా మాజీ సీనియర్ న్యాయవాది Elangovan  2020 నుంచి డీఎంకే పార్టీ తరఫున రాజ్యసభలో తమిళనాడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాకేష్ మరణవార్త తెలియడంతో సీఎం స్టాలిన్  సహా,  పలువురు పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu