ఆ ఉంగరంతో కరుణానిధి అంత్యక్రియలు.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటి?

Published : Aug 10, 2018, 11:20 AM ISTUpdated : Sep 09, 2018, 01:57 PM IST
ఆ ఉంగరంతో కరుణానిధి అంత్యక్రియలు.. ఆ రింగ్ స్పెషాలిటీ ఏంటి?

సారాంశం

 ఆ ఉంగరాన్ని బహుమతిగా తీసుకున్న నాటి నుంచి ఒక్కసారి కూడా దానిని కరుణానిధి తన వేలి నుంచి తొలగించకపోవడం గమనార్హం.  

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. కాగా.. ఆయన అంత్యక్రియలో సమయంలో చేతికి ఉన్న ఓ బంగారు ఉంగరాన్ని మాత్రం కుటుంబసభ్యులు ఎవరూ తొలగించలేదు. ఆయనతోపాటే ఆ ఉంగరాన్ని కూడా ఖననం చేశారు. ఆ ఉంగరం ప్రత్యేకత ఏంటో తెలుసా..? ఆ ఉంగరాన్ని అన్నాదురై.. కరుణానిధికి బహుమతిగా ఇచ్చారట.

తన జీవితంలో కరుణానిధి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి అన్నాదురై. అందుకే ఆయన ఇచ్చిన గుర్తును ఆయనతోపాటే ఉండాలని దానిని కరుణానిధి చేతి నుంచి తొలగించలేదట. 1959లో  డీఎంకే పార్టీకి చెందిన అరసు తొలిసారి మేయర్ గా గెలిచారు. డీఎంకే పార్టీ  ఆ ఎన్నికల్లో 45సీట్లను గెలుచుకుంది. దీంతో అరుసు చెన్నై నగరానికి మేయర్ గా ఎన్నికయ్యారు.

పార్టీ గెలవడానికి కరుణానిధి ఎంతగానో కృషి చేశారు. అందుకు గుర్తుగా అన్నాదురై.. కరుణానిధికి ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు.  ఆ ఉంగరాన్ని బహుమతిగా తీసుకున్న నాటి నుంచి ఒక్కసారి కూడా దానిని కరుణానిధి తన వేలి నుంచి తొలగించకపోవడం గమనార్హం.
 

PREV
click me!

Recommended Stories

PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu
PM Narendra Modi: దేశం గర్వపడేలా.. సౌదీ రాజులు దిగివచ్చి మోదీకి స్వాగతం| Asianet News Telugu