కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023: ఓటేసే ముందు గుడిలో పూజలు చేసిన డీకే శివకుమార్

Published : May 10, 2023, 10:53 AM ISTUpdated : May 10, 2023, 11:02 AM IST
కర్ణాటక  అసెంబ్లీ ఎన్నికలు  2023: ఓటేసే ముందు గుడిలో  పూజలు  చేసిన డీకే శివకుమార్

సారాంశం

కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్  ఇవాళ  ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఓటేసే ముందు  శివకుమార్ కటుంబ సభ్యులతో  గుడిలో పూజలు నిర్వహించారు.   

బెంగుళూరు: ఓటు హక్కును వినియోగించుకొనే ముందు  ఆలయంలో  కర్ణాటక పీసీసీ చీఫ్  డీకే శివకుమార్ బుధవారం నాడు పూజలు నిర్వహించారు.  ఇవాళ కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.   ప్రతి రోజూ  తాను  ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు  గుడికి వెళ్లడం ఆనవాయితీగా  వస్తుందన్నారు.  ఇవాళ  పోలింగ్  జరగుతున్నందున  తాను  ప్రత్యేకంగా  గుడికి రాలేదన్నారు.  తన  కొడుకు , కూతురు కూడా తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోనున్నట్టుగా  ఆయన  చెప్పారు 

also read:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023: తొలి మూడు గంటల్లో 13 శాతం పోలింగ్ నమోదు

యువ ఓటర్లు  ఈ దఫా  మార్పును కోరుకుంటున్నారని  డీకే శివకుమార్ చెప్పారు.  మార్పు  కోసం  యువ ఓటర్లు ఈ దఫా ఓటు  చేస్తారని  ఆయన అభిప్రాయపడ్డారు.  రాష్ట్రంలో  ఏం జరిగిందో  యువ ఓటర్లకు మొత్తం తెలుసునన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం మారితేనే తమ జీవితాల్లో  మార్పులు వస్తాయని  యువత నమ్ముతుందని  శివకుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు  చేస్తుందని ఆయన   ధీమాను వ్యక్తం  చేశారు.  

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?