బెంగుళూరులో ప్రేమోన్మాది ఘాతుకం: కాకినాడ యువతి దారుణ హత్య

Published : Mar 01, 2023, 03:42 PM ISTUpdated : Mar 01, 2023, 04:39 PM IST
బెంగుళూరులో ప్రేమోన్మాది ఘాతుకం: కాకినాడ యువతి దారుణ హత్య

సారాంశం

బెంగుళూరులో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు.  లీలా పవిత్ర అనే యువతిని  దివాకర్ అత్యంత దారుణంగా  హత్య  చేశాడు. లీలా పవిత్ర  స్వగ్రామం కాకినాడ.  

బెంగుళూరు: నగరంలోని  జీవనభీమా  పోలీస్ స్టేషన్ పరిధిలో  ఏపీ రాష్ట్రంలోని  కాకినాడకు  చెందిన యువతిని ప్రేమోన్మాది అత్యంత  దారుణంగా హత్య  చేశాడు.ఆంధ్రప్రదేవ్ రాష్ట్రంలోని  కాకినాడకు చెందిన  లీలా పవిత్ర  కర్ణాటకలోని బెంగుళూరులో విధులు నిర్వహిస్తుంది.  బెంగుళూరులోని ఓ ల్యాబ్ లో  ఆమె కొంతకాలంగా  విధులు నిర్వహిస్తుంది.  అయితే అదే  ల్యాబ్ లో  దివాకర్   పనిచేస్తున్నాడు.

వీరిద్దరి మధ్య  పరిచయం  ప్రేమగా మారింది.  ఈ విషయాన్ని  లీలా పవిత్ర  పేరేంట్స్ కు చెప్పింది. కానీ పెళ్లికి లీలా పవిత్ర పేరేంట్స్ అంగీకరించలేదు. పేరేంట్స్  ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో  లీలా పవిత్ర  దివాకర్ తో  దూరంగా  ఉంటుంది.  ఇటీవలనే  లీలాకు  మరో వ్యక్తితో  వివాహన్ని పేరేంట్స్  నిశ్చయించారు.

ఈ విషయం తెలుసుకన్న దివాకర్  రగిలిపోయాడు.   మంగళవారంనాడు రాత్రి విధులు ముగించుకొని  ఆఫీస్ నుండి బయటకు వచ్చిన లీలా పవత్రిపై కత్తతో విచక్షణరహితంగా  దివాకర్ దాడికి దిగాడు.  లీలా పవిత్ర శరీరంపై  16 చోట్ల కత్తి గాయాలున్నట్టుగా  వైద్యులు  చెప్పారు.  తీవ్రంగా గాయపడిన  లీలాను స్థానికులు ఆసుపత్రికి  తరలించారు.  అయితే  ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  లీలాపవిత్ర మృతి చెందింది.  ఈ ఘటన లీలా పవిత్ర కుటుంబంలో విషాదాన్ని నింపింది. నిందితుడు  దివాకర్ ను పోలీసులు అరెస్ట్  చేశారు.  

గతంలో కూడ ఇదే తరహలో దేశంలోని పలు చోట్ల  దాడులు చోటు  చేసుకున్నాయి. తమను ప్రేమించలేదని యువతులపై ప్రేమోన్మాదులు హత్య చేసిన విషయం తెలిసిందే.  

PREV
click me!

Recommended Stories

Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు