జూన్ 1 నుంచి రెస్టారెంట్లు, బార్లకు అనుమతి: ముఖ్యమంత్రి హామీ?

By Sree s  |  First Published May 26, 2020, 7:13 PM IST

లాక్ డౌన్ ఆంక్షలను చాలావరకు సడలించడం, ప్రజారవాణ కూడా ప్రారంభమవడంతో ఇక తమకు కూడా తమ బిజినెస్ లు తెరుచుకోవడానికి అనుమతించాలని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వారు ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిశారు. జూన్ ఒకటవ తేదీనుంచి వాటిని నడుపుకోవడానికి అనుమతులివ్వనున్నట్టు ఆయన వారికి తెలిపినట్టు తెలియవస్తుంది. 


కరోనా వైరస్ మహమ్మారి భయానికి ఫిజికల్ డిస్టెంసింగ్ తప్ప వేరే మార్గం లేదను అని నిశ్చయించుకున్న ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది. అంతకు పూర్వమే జనసమ్మర్థమైన ప్రాంతాలన్నింటినీ మూసేయడంతో రెస్టారెంట్లు, బార్లు, పబ్బులు అన్ని కూడా మూతపడ్డాయి. 

ఇప్పుడు నాలుగవ దఫా లాక్ డౌన్ కూడా ఈ నెలాఖరుకు ముగుస్తూ ఉండడం, దాదాపుగా లాక్ డౌన్ ఆంక్షలను చాలావరకు సడలించడం, ప్రజారవాణ కూడా ప్రారంభమవడంతో ఇక తమకు కూడా తమ బిజినెస్ లు తెరుచుకోవడానికి అనుమతించాలని హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ వారు ముఖ్యమంత్రి యడ్యూరప్పను కలిశారు. జూన్ ఒకటవ తేదీనుంచి వాటిని నడుపుకోవడానికి అనుమతులివ్వనున్నట్టు ఆయన వారికి తెలిపినట్టు తెలియవస్తుంది. 

Latest Videos

హోటళ్లకు, రెస్టారెంట్లు అనుమతులు గనుక దొరికితే.... బార్లకు కూడా అనుమతులిచ్చే యోచన చెయ్యొచ్చు సర్కార్. ఇప్పటికే వారు సైతం రెండు నారా నెలలుగా మూసుకొని ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. చాలా చోట్ల భవనాలకు రెంట్లు కట్టడం కూడా ఇబ్బందికరంగా మారిపోయింది. 

ఇలాగనుక ఒక్క రాష్ట్రం నిర్ణయం తీసుకున్నాయి... మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. హోటళ్లకు పర్మిషన్ ఇస్తే... బార్లకు కూడా అనుమతులు వచ్చే ఆస్కారం ఉంది. 

ఇకపోతే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కావడం లేదు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరొకరు మరణించారు. తూర్పు గోదావరి జిల్లాలో గత 24 గంటల్లో ఒకరు కరోనాతో మరణించారు. 

రాష్ట్రంలో గత 24 గంటల్లో 8,148 శాంపిల్స్ ను పరీక్షించగా 48 మందికి కోవిడ్ -19 పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో 55 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2619 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1903 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా 759 మందజి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

గత 24 గంటల్ల నమోదైన కేసుల్లో నాలుగు కేసులు కోయంబేడు మార్కెట్ తో లింకులున్నవి. ఈ నాలుగు కేసులు కూడా చిత్తూరు జిల్లాలోనే నమోదయ్యాయి.

విదేశాల నుంచి వచ్చినవారిలో 111 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ రోజు కొత్త 49 కేసులు నమోదయ్యాయి. వీటిలో కువైట్ కు చెందిన కేసులు 49 కాగా, అబూ దుబాయ్ నుంచి వచ్చినవారిలో ముగ్గురికి, ఖతర్ నుంచి వచ్చినవారిలో ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 

 ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 153 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇందులో ఒదడిశాకు చెందినవారు 10 మంది, మహారాష్ట్రకు చెందినవారు 101 మంది, గుజరాత్ నుంచి వచ్చినవారు 26 మంది ఉన్నారు. కర్ణాటక నుంచి వచ్చినవారిలో ఒకరికి, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చినవారిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు నిర్దారణ అయింది. రాజస్థాన్ నుంచి వచ్చినవారిలో 11 మందికి, తమిళనాడు నుంచి వచ్చినవారిలో ముగ్గురికి కరోనా వైరస్ పాజిటి ఉన్నట్లు తేలింది.  

click me!