అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. నలుగురు చిన్నారులతో సహా 14 మంది మృతి

By Rajesh KarampooriFirst Published Feb 1, 2023, 6:42 AM IST
Highlights

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ధన్‌బాద్‌లోని ఆశిర్వాద్ అనే రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో మంటలు అంటుకుని భవనం మొత్తానికి అగ్నికీలలు వ్యాపించాయి. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో 14 మంది చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం. 

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం ధన్‌బాద్‌లోని ఆశిర్వాద్ అనే రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు 14 మంది మరణించారు. ఇందులో 10 మంది మహిళలు, ముగ్గురు పిల్లలు, ఒక వృద్ధుడు ఉన్నారు. అదే సమయంలో 35 మందికి పైగా రక్షించబడ్డారు.

వారిలో పలువురి చాలా సీరియస్ గా ఉంది. వారిని సమీపంలోని ఆసుపత్రిలో చేరారు. సమాచారం అందే సమయానికి అర్థరాత్రి దాటే సమయంలోనూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది.  అగ్ని ప్రమాదం తీవ్రత చూస్తోంటే.. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానిక అధికారవర్గాలు తెలిపాయి. రెస్క్యూ ఆపరేషన్ పూర్తయితే.. కానీ మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు. 
 
జోడా ఫటక్‌లోని పది అంతస్తుల ఆశీర్వాద్‌ ట్విన్‌ టవర్‌లోని మూడో అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు మంటలు చెలరేగాయి. ప్రమాదశాత్తు మంటలు చెలరేగి ఫ్లాట్‌ మొత్తం వ్యాపించాయి. సిలిండర్‌ కూడా లీక్ అయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత మంటలు ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వ్యాపించాయి. నాల్గవ అంతస్తులోని  ఫ్లాట్‌లోని వ్యక్తులు మంటలను చూసి, వారు అప్రమత్తం చేశారు.

వారి అర్తనాథాలు విన్న గార్డు అప్రమత్తమై.. వెంటనే కరెంటు, లిఫ్ట్‌ను డిస్‌కనెక్ట్ చేశాడు. నలువైపుల నుంచి ప్రజలు మంటల్లో చిక్కుకున్నారు. జనం ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి బాల్కనీకి వచ్చారు. మహిళలు, పిల్లలు సహాయం కోసం కేకలు వేయడం ప్రారంభించారు. కొందరు మెట్లు దిగి పరిగెత్తారు. కానీ .. మంటలు చుట్టుమట్టడంతో వారికి బయటకు వెళ్లే.. అవకాశం లేకోపోయింది. దీంతో వారు అక్కడే కాలిపోయారు. రెండో అంతస్తు నుంచి 6వ అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి.

నాల్గవ అంతస్తులో అత్యధిక మరణాలు

20 అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పాయి. భవనం మొత్తం పొగలు అలుముకున్నాయి. జనం ఫ్లాట్ వదిలి పైన డాబా మీదకు చేరుకున్నారు. దాదాపు రెండు గంటల తర్వాత మంటలు అదుపులోకి వచ్చాయి. అందరినీ బయటకు తీశారు. అత్యధిక మరణాలు నాలుగో అంతస్తులో జరిగినట్టు తెలుస్తోంది. ఈ నాల్గవ అంతస్తులో ఓ పూజ కార్యక్రమంలో జరిగింది. ఈ ప్రమాదంలో 35 మందికి పైగా కాలిపోయారు. అందులో కొన్ని సీరియస్‌గా ఉన్నాయి. మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి, కొంతమంది రెస్క్యూ సిబ్బందికి కూడా కాలిన గాయాలయ్యాయి. ప్రజలను రక్షించే క్రమంలో బ్యాంక్ మోద్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పీకే సింగ్ కూడా కాలిపోయాడు. అతడిని చికిత్స నిమిత్తం స్థానిక నర్సింగ్‌ హోమ్‌లో చేర్చారు.
  
సీఎం హేమంత్ సోరెన్ సంతాపం 

ఈ ఘటనపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మాజీ సీఎం అర్జున ముండా, బాబూలాల్ మరాండీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నేనే పరిశీలిస్తున్నానని, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం సోరెన్ తన ట్విట్టర్  వేదికగా వెల్లడించారు. 

4 రోజుల క్రితం ధన్‌బాద్‌లో ఇలాంటి ప్రమాదం 

జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో మంటలు చెలరేగాయి. ఇందులో సజీవ దహనమై డాక్టర్ దంపతులతోపాటు 6 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు. బాత్‌టబ్‌లో డాక్టర్ మృతదేహం లభ్యమైంది. తనను తాను రక్షించుకునేందుకు నీటి తొట్టెలో కూర్చున్నట్లు సమాచారం. ఇక్కడే అతని మృతదేహం లభ్యమైంది

click me!