సోషల్ మీడియాలో యాక్టివ్.. క్రిమినల్ రికార్డుల్లేవ్.. ఒవైసీపై దాడి చేసిన ఇద్దరి వివరాలివే..!

Published : Feb 04, 2022, 04:17 PM IST
సోషల్ మీడియాలో యాక్టివ్.. క్రిమినల్ రికార్డుల్లేవ్.. ఒవైసీపై దాడి చేసిన ఇద్దరి వివరాలివే..!

సారాంశం

ఏంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఉత్తరప్రదేశ్‌లో జరిపిన కాల్పులు సంచలం అయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిద్దరికీ గతంలో నేర చరిత ఏమీ లేదు. కానీ, ఒవైసీ చేసే వ్యాఖ్యలపై, రామ జన్మ భూమి, రామ మందిరం గురించిన ఒవైసీ చేసే వ్యాఖ్యలు తీవ్రంగా ఆగ్రహాన్ని రగిలించాయని వారిద్దరూ పేర్కొన్నట్టు పోలీసు వర్గాలు తెలిపాయి.  


హైదరాబాద్: హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం(AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi)పై ఉత్తరప్రదేశ్‌లో కాల్పులు(Firing) జరిగిన సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆయన ప్రచారానికి వెళ్లారు. హాపూర్‌లో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై గురువారం కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. హాపూర్ కోర్టులో వీరిద్దరిని హాజరు పరిచి కస్టడీలోకి తీసుకోవడానికి న్యాయస్థానాన్ని కోరుతామని యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అయితే, ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నదని వివరించారు. అసదుద్దీన్ ఒవైసీపై కాల్పులు జరిపినట్టుగా అనుమానిస్తున్న ఇద్దరు వ్యక్తులు సచిన్, శుభమ్‌లను అరెస్టు చేశారు. వీరిద్దరి గురించిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. వీరిద్దరికీ గతంలో నేరచరిత్ర ఏమీ లేదు. కానీ, ఇద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది. అంతేకాదు, ఇందులో ఒకరు సోషల్ మీడియాలో ద్వేషపు పోస్టులు పెట్టినట్టు సమాచారం.

నిందితుడు సచిన్ నోయిడాలోని బాదల్‌పుర్‌ నివాసి. ఆయన ఎల్ఎల్ఎం చేసినట్ట చెప్పారని పోలీసులు వివరించారు. ఈయనకు ఓ ఫేస్‌బుక్ పేజీ ఉన్నది. పేరు.. దేశ్‌భక్త్ సచిన్ హిందు. ఈ పేజీలో ఆయన చేసిన కొన్ని పోస్టులు మతపరమైన ద్వేషంతో నిండి ఉన్నట్టు తెలిసింది. అలాగే, శృతిమించిన(?) జాతీయవాదంతో ఉన్నట్టు సమాచారం. 2018 జూన్ 1వ తేదీన అసదుద్దీన్ ఒవైసీ ఫోటో పోస్టు చేశారు. అందులో ఒవైసీని చూపిస్తూ ఉండే ఓ ఖడ్గం ఉన్నది. మరో పోస్టులో ప్రధాని మోడీ.. నాకు ఆర్‌డీఎక్స్ బాంబ్ పెట్టండి.. ఆ తర్వాత నన్ను పాకిస్తాన్‌లో విసిరేండి.. అందుకు నేను సిద్ధం అంటూ ఆవేశంగా ఓ పోస్టు పెట్టారు. భారత మాత కోసం ఎందరో వీరులు చేసిన త్యాగాల రుణం తీర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

సచిన్ అరెస్టు తర్వాత పోలీసులు ఆయన కుటుంబాన్ని కనీసం ఐదు నుంచి ఆరు గంటలపాటు విచారించారు. సచిన్ తండ్రి వినోద్ 20 నుంచి 25 కంపెనీలకు లేబర్లను అందించే పని చేస్తుంటాడు. సచిన్ కూడా అందులో తోడుగా పని చేస్తుంటాడని వివరించాడు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో సచిన్ ఇల్లు విడిచి బయటకు వెళ్లాడని, ఓ కంపెనీ పని మీదనే బయటకు వెళ్తున్నట్టు చెప్పాడని తెలిపాడు. ఎందుకో తెలియదు కానీ, రెండు మూడు రోజులుగా తన కొడుకు అప్‌సెట్ అయ్యాడని పేర్కొన్నాడు.

సహరన్‌‌పూర్‌కు చెందిన సంప్లా బేగంపూర్ వాసి శుభమ్. ఆయన తల్లిదండ్రలు మరణించారు. సోదరికి పెళ్లి అయింది. పదో తరగతి పాస్ అయిన శుభమ్ సాగు సంబంధ పనులు చేసుకుంటుంటాడు. ఎక్కువ సొంతూరులో ఉండరు. గజియాబాద్‌లోని మోదిపురంలో ఉంటాడని స్థానికులు చెప్పారు. 

అయితే, విచారణలో వీరిద్దరూ అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ చేసే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు తెలిపారని పోలీసువర్గాలు వివరించాయి. సోషల్ మీడియాలో ఒవైసీ స్పీచ్‌లను వారు వింటూ ఉంటారని తెలిపాయి. అయోధ్య రామ మందిరం, రామ జన్మభూమి వివాదంపై ఒవైసీ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు వారిద్దరూ పేర్కొన్నట్టు వివరించాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి ఒవైసీ వస్తున్నట్టు తమకు తెలిసిందని, అక్కడే ఆయన అంతుచూడాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నాయి. ఈ ఇద్దరి దగ్గర నుంచి కంట్రీ మేడ్ పిస్టోల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుట్రలో భాగస్వామ్యంగా ఉన్న మరో ఇద్దరి పేర్లనూ వారి ప్రకటించారని,  వారి కోసం గాలింపులు జరుగుతున్నాయని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం