ఢిల్లీలో పోలింగ్ శాతం తగ్గినా ఆప్ ఎందుకు లాభపడింది?

By telugu teamFirst Published Feb 11, 2020, 5:25 PM IST
Highlights

నేటి ఉదయం ఫలితాలు  వెలువడడం మొదలైనప్పటి నుండి ఈ తగ్గిన వోటింగ్ శాతం ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా పరిణమించినట్టు మనకు కనబడుతుంది. ఎన్నికల ఫలితాలను దగ్గరగా పరిశీలిస్తే మనకు ఈ విషయం తేటతెల్లం అవుతుంది. 

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు దాదాపుగా ఖాయమైపోయింది. ఉన్న 70 సీట్లలో దాదాపుగా 63సీట్లలో విజయం సాధించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం వద్ద అప్పుడే సంబరాలు మొదలయ్యాయి. కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటున్నారు. 

ఈ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ గెలుస్తాడని అందరూ చెప్పినప్పటికీ కూడా వోటింగ్ శాతం తక్కువగా నమోదవడంతో ఇటు బీజేపీ, అటు ఆమ్ ఆద్మీపార్టీలు ఈ తగ్గిన ఓటింగ్ శాతం తమకంటే తమకు అనుకూలం అని చెప్పుకున్నాయి. 

నేటి ఉదయం ఫలితాలు  వెలువడడం మొదలైనప్పటి నుండి ఈ తగ్గిన వోటింగ్ శాతం ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా పరిణమించినట్టు మనకు కనబడుతుంది. ఎన్నికల ఫలితాలను దగ్గరగా పరిశీలిస్తే మనకు ఈ విషయం తేటతెల్లం అవుతుంది. 

Also read: ఢిల్లీని ఊడ్చేసిన కేజ్రీవాల్... వారి ఫార్ములాతోనే బీజేపీని మట్టికరిపించిన ఆప్

మొదటగా పురుషులతోపాటు సమానంగా నమోదయిన మహిళల ఓటింగ్ కేజ్రీవాల్ కు కలిసి వచ్చింది. మహిళలు ముఖ్యంగా దిగువ మధ్యతరగతి నుండి మొదలు పెద్ద మహిళల వరకు అందరూ కేజ్రీవాల్ వెంటనే నడిచారు. 

గతంలోని ఫలితాలను పరిశీలించినప్పటికీ మనకు ఈ విషయం తేటతెల్లం అవుతుంది. మహిళల ఓటింగ్ అధికంగా నమోదైన ప్రతిచోటా ఆప్ గెలిచింది. ఈ సారి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలే టార్గెట్ గా ప్రచారం కూడా చేసింది. వారిని దృష్టిలో ఉంచుకొనే అనేక సంక్షేమ పథకాలను కూడా రూపొందించింది. 

ఇక ఈ ఎన్నికలకు వచేసారకు తగ్గిన వోటింగ్ శాతం ఏ పార్టీకి లాభం చేకూర్చిందో తెలుసుకోవాలంటే... ముందుగా మనం పార్టీలకు మద్దతు తెలిపే వివిధ సామాజికవర్గాల గురించి మనం తెలుసుకోవాలిసి ఉంటుంది. 

బీజేపీకి ముఖ్యంగా ఎగువ మధ్యతరగతికి చెందిన ప్రజలు, అగ్ర కులాల వారు ఇతరులు మనకు సహజంగా కనిపిస్తారు. సాధారణంగా వీరిలో ఎక్కువశాతం మంది వీక్ ఎండ్ వస్తే లీవ్ తీసుకునే టైపు. 

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కి మద్దతు తెలిపే వర్గాలకు వస్తే ముఖ్యంగా రోజువారీ వేతన కూలీలు, మహిళలు, దిగువ మధ్యతరగతి స్థాయి సాధారణ ప్రజలు, ఎస్సిలు, మైనారిటీ వర్గ ప్రజలు. కాంగ్రెస్ ఉన్నట్టుగా మనకు కనపడవచు... కానీ కాంగ్రెస్ ఇక్కడ ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడ జోరు కనిపించలేదు. దాదాపుగా కాంగ్రెస్ ఇక్కడ ఉన్న లేనట్టే. 

Also read: దేశ రాజధానిలో పాగా వేసిన ఆప్.... జాతీయ రాజకీయ పావులను కూడా కదపటం మొదలెట్టేసింది

ఈ ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులంతా భారీ సంఖ్యల్లో వచ్చి వోట్ వేశారు. బీజేపీ కోర్ ఓటర్లంతా వోట్ వేసింది. అందులో ఎటువంటి సంశయం అవసరం లేదు. కానీ బీజేపీకి చెందిన ఫ్లోటింగ్ ఓటర్ మాత్రం ఈసారి ఎన్నికల్లో వోట్ వేసినట్టుగా కనబడడం లేదు. 

సాధారణంగా వోటింగ్ శాతం తగ్గినప్పుడు క్యాడర్ పార్టీలు లాభపడతాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా బీజేపీతో పోల్చినప్పుడు అంతటి బలమైన క్యాడర్ లేకున్నప్పటికీ... ఆప్ లబ్ధిదారులు వారికి భారీసంఖ్యలో ఓట్లు వేశారు. ఒక రకంగా ఇది సామాన్యుడి విజయం.  

click me!