దీపావళి బాణసంచా ఎఫెక్ట్: ఢిల్లీలో ప్రమాదకరస్థాయికి చేరిన వాయు కాలుష్యం

By narsimha lodeFirst Published Nov 5, 2021, 11:11 AM IST
Highlights

ఢిల్లీలో దీపావళి సందర్భంగా బాణ సంచా కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరిగింది. వాయు కాలుష్యం పెరిగిన కారణంగా ప్రజలు కళ్ల మంట, గొంతు దురదతో ఇబ్బందులు పడుతున్నారు.

న్యూఢిల్లీ:Diwali సందర్భంగా  crackery పేల్చడం ద్వారా Delhiలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం చేరింది. టపాసులపై నిషేధం విధించినా కూడ టపాసులు కాల్చడం వల్ల  Air Pollution మరింత పెరిగింది.

ఢిల్లీలో గురువారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 382గా నమోదైంది.  దీపావళిని పురస్కరించుకొని టపాసులు పేల్చడం వల్ల గాలిలో వాయు కాలుష్యం పెరిగింది. ఢిల్లీలోని పలు చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 గా రికార్డైంది. పూసా రోడ్డు వద్ద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 505కి చేరిందని అధికారులు చెప్పారు.

also read:వాతావరణ కాలుష్యం: హైదరాబాద్‌లో ఆ రెండు ఏరియాల్లోనే స్వచ్ఛమైన గాలి

శుక్రవారం నాడు ఉదయం నగరంలోని జవహర్‌లాల్ నెహ్రు స్టేడియంలో 999 క్యూబిక్ మీటర్‌కు పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5 గా నమోదైంది.  పొరుగున ఉన్న ఫరీదాబాద్ లో 424, ఘజియాబాద్ లో 4421, నోయిడాలో 431 గా నమోదైందని అధికారులు తెలిపారు. టపాకాయలు కాల్చడం ద్దవారా గాలిలో కాలుష్యం పెరిగిందని అధికారులు తెలిపారు.

ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో టపాకాయలు కాల్చడంపై నిషేధం విధించినా కూడ దీపావళిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరిగింది.దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్‌నగర్, ఉత్తర ఢిల్లీలోని బురారీ, పశ్చిమ ఢిల్లీలోని పశ్చిమ విహార్, తూర్పు ఢిల్లీలోని షహదారా వాసులు రాత్రి 7 గంటల వరకే  టపాకాయలను కాల్చారు.నగరం శివారు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు గొంతు దురద, కళ్లలో నీరు కారుతున్నట్టుగా ఫిర్యాదులతో ప్రజలు ఆసుపత్రులకు చేరుతున్నారు.

హర్యానా ప్రభుత్వం జాతీయ రాజధాని ప్రాంతంలోని 14 జిల్లాల్లో అన్ని రకాల టపాకాయల వినియోగంపై నిషేధం విధించింది.  సెంటర్ రన్ సిస్టమ్ ఆన్ ఎయిర్ క్వాలిటీ, వెదర్ పోర్ కాస్టింగ్ రీసెర్చ్ ప్రకారం ఆదివారం నాడు సాయంత్రం వరకు అంటే నవంబర్ 7వ తేదీ వరకు గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం లేదని అధికారులు తెలిపారు.

ప్రతికూల వాతావరణ పరిస్థితులు,  తక్కువ ఉష్ణోగ్రత, బాణసంచా కాల్చడం వల్ల గాలి నాణ్యత తగ్గిపోయిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీలో 24 గంటల వాయు నాణ్యత సూచిక బుధవారం  ఉదయం 314 గా గురువారం నాడు ఉదయం 382 గా నమోదైంది. మంగళవారం నాడు 303, సోమవారం నాడు 281గా రికార్డైందని అధికారులు ప్రకటించారు.

సున్నా నుండి 50 మంది  అవరేజీ క్వాలిటీ ఇండెక్స్  (AQI) మంచిదిగా చెబుతారు. 51 నుండి 100 సంతృప్తికరంగా, 101 నుండి 200 వరకు మితమైందిగా, 201 నుండి 300 వరకు గాలిలో నాణ్యత లేనిదిగా చెబుతారు. 301 నుండి 400 వరకు గాలిలో కాలుష్యం తీవ్రమైందిగా అధికారులు చెబుతున్నారు. 401 నుండి 500 వరకు గాలిలో కాలుష్యం మోతాదు మించిందిగా అధికారులు పరిగణిస్తారు.

టపాకాయల విక్రయాలతో పాటు కాల్చడంపై రాష్ట్రాలు నిషేధం విధించినా కూడా విచ్చలవిడిగా బాణసంచా కాల్చడం ద్వారా  వాయు కాలుష్యం పెరిగింది. అయితే నిషేధం విధించి దాన్ని అమలుకు పాలకులు చర్యలు తీసుకోని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందనే విమర్శలు కూడా లేకపోలేదు.  
 


 

click me!