కరోనా రోగులకు నేరుగా ఆక్సిజన్: ఢిల్లీ సర్కార్ ప్రయోగం

By narsimha lodeFirst Published May 6, 2021, 4:26 PM IST
Highlights

ఢిల్లీలో కరోనా రోగులకు  నేరుగా ఆక్సిజన్ అందించేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కరోనాతో హోంఐసోలేషన్ లో ఉంటూ కరోనా రోగులకు నేరుగా ఆక్సిజన్ ను అందించేందుకు కేజ్రీవాల్ సర్కార్  చర్యలు తీసుకొంటుంది. 

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా రోగులకు  నేరుగా ఆక్సిజన్ అందించేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కరోనాతో హోంఐసోలేషన్ లో ఉంటూ కరోనా రోగులకు నేరుగా ఆక్సిజన్ ను అందించేందుకు కేజ్రీవాల్ సర్కార్  చర్యలు తీసుకొంటుంది. ఆక్సిజన్ అవసరమైన కరోనా రోగులు ప్రభుత్వం సూచింనిన వెబ్‌సైట్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కేజ్రీవాల్ సర్కార్ కోరింది.

ఆక్సిజన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకొనేవారంతా  ఆధార్ కార్డు, కోవిడ్ టెస్టు రిపోర్టు, సిటీ స్కాన్ రిపోర్టును జతపర్చాలని ఢిల్లీ సర్కార్ సూచించింది. రోగి కానీ రోగి కుటుంబసభ్యులు లేదా బంధువులు  వెబ్ సైట్ లో  ఈ వివరాలను పొందుపర్చవచ్చని ఢిల్లీ సర్కార్ కోరింది. ఆక్సిజన్ సరఫరాను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది.

ఆక్సిజన్ కోసం ఆన్‌లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకొన్నవారికి ఎప్పుడు ఎక్కడ ఆక్సిజన్ సిలిండర్లను అందించనుందో కూడ నేరుగా ధరఖాస్తుదారుడికి సమాచారం అందించనున్నారు. ఆన్‌లైన్ లో ధరఖాస్తుల పరిశీలన కోసం సిబ్బందిని నియమించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కలెక్టర్లను ఆదేశించారు. అర్హులైనవారందరికీ ఆక్సిజన్ సిలిండర్లు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆయన  అధికారులను కోరారు. 

click me!