
Delhi man rapes visually challenged woman: దేశంలో మహిళల రక్షణ ఆందోళన కలిగిస్తోంది. వారి రక్షణ కోసం ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. వాటి అమలులోపమో ఏమోగానీ వారిపై దాడులు, హింస, అఘాయిత్యాలు ఆగడం లేదు. ఈ క్రమంలోనే కంటిచూపులేని ఓ మహిళను రోడ్డు దాటిస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు ఓ దుండగుడు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.
ఈ దారుణ ఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ఇలా ఉన్నాయి... నైరుతి ఢిల్లీలో ఒక వ్యక్తి దృష్టిలోపం ఉన్న మహిళను రోడ్డు దాటడానికి సహాయం చేస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. ఈ ఘటన మే 25న చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేశాడని మహిళ పోలీసులను ఆశ్రయించింది. దబ్రీలో ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత మహిళ బస్సులో ప్రాయాణిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె దిగాల్సిన బస్టాప్ లో కాకుండా వేరే బస్టాప్ లో దిగింది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ఆమెను రోడ్డు దాటేందుకు సహాయం చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆమెను రోడ్డు దాటిస్తానని చెప్పి.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డాడు.
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 376 కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ ట్వీట్ చేశారు. "మే 25న, ఒక అంధ బాలిక పొరపాటున మరొక బస్టాప్‌లో దిగింది. ఆమెను రోడ్డు దాటడానికి సహాయం చేస్తాననే నెపంతో ఒక వ్యక్తి ఆమెను వీధిలోకి తీసుకువెళ్లాడు, కానీ ఆమెపై అత్యాచారం చేశాడు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. నేను అమ్మాయిని కలిశాను మరియు మేము ఉన్నాము ఆమెకు పూర్తిగా సహాయం చేస్తోంది. కానీ నిజంగా ఇలాంటి మానవ మృగాలకు జంతు మనస్తత్వానికి పరిమితి లేదు !" అని ఆమె ట్విట్టర్‌లో తెలిపారు.
అలాగే, గతవారంలో ఉత్తరప్రదేశ్ లో మళ్లీ దారుణం జరిగింది. తొమ్మిదో తరగతి చదివే 15 ఏళ్ల బాలికపై ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కుమారుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.