అక్రమ సంబంధం.. భార్యపై అనుమానం.. చివరకు.

Published : Jan 16, 2021, 11:45 AM ISTUpdated : Jan 16, 2021, 12:32 PM IST
అక్రమ సంబంధం.. భార్యపై అనుమానం.. చివరకు.

సారాంశం

అమన్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్జీత్ విహార్ ప్రాంతంలో ఓ మహిళ అదృశ్యమైనట్టు సోమవారం పోలీసులు సమాచారం అందుకున్నారు. 

భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని అతని అనుమానం. ఆ అనుమానం కాస్త పెనుభూతంగా మారింది. చివరకు భార్యను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దేశరాజధాని ఢిల్లీలోని చావ్లా తేజ్ పూర్ రోడ్డు పక్కన ఈ నెల 4వ తేదీన ఓ మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కాగా.. ఆమె గొంతు కోసం చంపినట్లు పోలీసులు గుర్తించారు. అమన్ విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్జీత్ విహార్ ప్రాంతంలో ఓ మహిళ అదృశ్యమైనట్టు సోమవారం పోలీసులు సమాచారం అందుకున్నారు. 

అదృశ్యమైన మహిళ వివరాలు తమకు లభ్యమైన మహిళ మృతదేహం వివరాలతో సరిపోలినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బల్జీత్ విహార్‌లోని మహిళ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆమె కుమారుడు శివంను ఆసుపత్రికి తీసుకెళ్లి మృతదేహాన్ని చూపించారు. ఆమెను చూసి శివం బోరుమన్నాడు. ఆమె తన తల్లి సరస్వతి అని చెప్పాడు. అయితే, భర్త సోహన్ కనిపించకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.

దీంతో అతడి కోసం గాలింపు మొదలుపెట్టిన పోలీసులు తాజాగా సోహన్‌ను అరెస్ట్ చేశారు. ఆమెను తానే చంపినట్టు దర్యాప్తులో వెల్లడించాడు. తమతో రెండేళ్లుగా కలిసి ఉంటున్న చందన్ అనే వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉండడంతోనే ఆమెను చంపేసినట్టు వివరించాడు. మార్కెట్‌కు, అక్కడి నుంచి వికాశ్ విహార్ నాలా వద్దకు వెళ్దామని నమ్మించి ఈ నెల 3న భార్యను తీసుకుని సోహన్ కారులో బయలుదేరాడు. అనంతరం ఆమె మెడను ప్లాస్టిక్ తాడుతో బిగించి, ఆపై కత్తితో గొంతు కోసి చంపేశాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని తేజ్‌పూర్ చావ్లా రోడ్డు పక్కనున్న పొదల్లో పడేసినట్టు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?