
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఆమె కూతురు గోవా రెస్టారెంట్‌కు ఓనర్లు కాదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. వారే యజమానులు అని ఎప్పుడూ లైసెన్సులు జారీ కాలేదని వివరించింది. స్మృతి ఇరానీ కూతురు గోవాలో అక్రమంగా ఓ రెస్టారెంట్ నడుపుతున్నదని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు సంధించారు. వారిపై సివిల్ డిఫమేషన్ సూట్‌ను ఇరానీ దాఖలు చేశారు. ఈ సూట్‌ను ఢిల్లీ హైకోర్టు విచారించి అనంతరం, కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, నెట్టా డిసౌజా, జైరాం రమేశ్‌లకు సమన్లు పంపింది.
స్మృతి ఇరానీ, ఆమె కూతురు ఆ రెస్టారెంట్‌కు యజమానులు కాదని, వారు ఎప్పుడూ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయలేదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఆ రెస్టారెంట్ లేదా, ఆ భూమికీ వీరు యజమానులు కాదని స్పష్టం చేసింది. కాబట్టి, వీరిపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులను తొలగించాలని ఆదేశించింది.
కాగా, ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ఈ ఆరోపణలను కేవలం గాంధీ కుటుంబం ఆదేశాల మేరకే వచ్చాయని పేర్కొన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అక్రమాల గురించి తాను మాట్లాడుతూ ఉంటాను కాబట్టే తనను టార్గెట్ చేశారని తెలిపారు.
సొసైటీలో గౌరవనీయ స్థానంలో ఉన్న స్మృతి ఇరానీ రెప్యుటేషన్‌ను కాపాడాల్సిన అవసరం ఉన్నదని కోర్టు పేర్కొనడం గమనార్హం.