
Tiranga Samman Samitis: ఢిల్లీ ప్రభుత్వం ఆగస్టు 15 నాటికి ఢిల్లీ అంతటా 500 త్రివర్ణ పతాకాలను ఏర్పాటు చేయనున్నది.వీటి పరిరక్షణ కోసం వాలంటీర్ ఆధారిత కమిటీలను ఏర్పాటు చేసింది. ఒక్కో తిరంగ సమ్మాన్ కమిటీలో 1000 మంది వాలంటీర్లు ఉంటారు.
శనివారం త్యాగరాజ్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేజ్రీవాల్.. తిరంగ సమ్మాన్ కమిటీ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడారు. తమ ప్రభుత్వం “దేశభక్తి బడ్జెట్” కింద నగరం అంతటా 500 త్రివర్ణాలను ఏర్పాటు చేస్తుందని, వారి సంరక్షణ కోసం స్వచ్ఛంద ఆధారిత కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు.
కేజ్రీవాల్ ప్రకారం.. ప్రతి తిరంగ సమ్మాన్ సమితి 1,000 మంది యువ వాలంటీర్లను చేర్చుకుంటారు. వారు సామాజిక సంక్షేమానికి కట్టుబడి ఉండాలి. ఐదుగురు సభ్యుల బృందం.. తిరంగ సమ్మాన్ కమిటీపై నిఘా పెడుతుందని,ప్రతి త్రివర్ణ పతాకం యొక్క స్థితిపై పరిశీలిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. దుమ్ము, తుఫాను, కాలుష్యం వల్ల ఏదైనా త్రివర్ణ పతాకానికి నష్టం జరిగిందా అనే విషయాన్ని తిరంగ సమ్మాన్ కమిటీ పీడబ్ల్యూడీ అధికారులకు తెలియజేస్తుందనీ. దీంతో పాటు ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు జాతీయ గీతం ఆలపించేందుకు కమిటీలు త్రివర్ణ పతాకానికి బదులు వీలైనంత ఎక్కువ మందిని సమీకరించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కమిటీను పార్టీలకు అతీతంగా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కమిటీ వాలంటీర్లు AAP, BJP, కాంగ్రెస్‌కు చెందిన వారు కాదనీ, వారు భారతదేశ వాలంటీర్లని అన్నారు.
ఈ కమిటీలు తమ తమ ప్రాంతాల్లో 1,000 మంది వాలంటీర్లను చేర్చుకుంటాయని, వారు దేశానికి సేవ చేస్తారని, సామాజిక సంక్షేమానికి కృషి చేస్తారని కేజ్రీవాల్ చెప్పారు. ఈ వలంటీర్లకు ఐదుగురు విధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
అవి..
1. కమిటీ పరిధిలో ఆకలితో ఆలమటిస్తున్న ఆనాధలకు ఆహార వసతి కల్పించడం.
2. బడి ఈడు పిల్లలను పాఠశాలలో చేర్చడం.
3. పేదలకు వైద్య సహాయం అందించడం.
4. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం.
5. పరిసరాల పరిశుభ్రత.
ప్రతి చేతిలో త్రివర్ణ పతాకం ఉండాలన్నదే మా లక్ష్యం అని కేజ్రీవాల్ అన్నారు. కొద్ది రోజుల తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ‘హర్ హాత్ తిరంగ’ పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామనీ, 130 కోట్ల మంది ప్రజలు కలిసి భారతదేశం కోసం ఆలోచించడం ప్రారంభించిన రోజున పేదరికం నిర్మూలించబడుతుందని, భారతదేశం పురోగమిస్తుందనీ, అప్పుడే భారత్ ప్రపంచ గురువుగా అవతరిస్తుందని అన్నారు.
ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం 200 త్రివర్ణ పతాకాలను అమర్చామని, ఆగస్టు 15 నాటికి మొత్తం 500 త్రివర్ణాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం గత ఏడాది తన 'దేశభక్తి బడ్జెట్'లో భాగంగా.. నగరం అంతటా 115 అడుగుల ఎత్తుతో 500 త్రివర్ణాలను ఏర్పాటు చేయనున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే..