అల్లర్లు: ఢిల్లీ కొత్త పోలీస్ బాస్ గా శ్రీవాస్తవ, అమూల్య ఔట్

Published : Feb 28, 2020, 12:54 PM IST
అల్లర్లు: ఢిల్లీ కొత్త పోలీస్ బాస్ గా శ్రీవాస్తవ, అమూల్య ఔట్

సారాంశం

ఢిల్లీలో చెలరేగిన హింసపై పెద్ద యెత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసు కమిషనర్ గా శ్రీవాస్తవ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అమూల్య స్థానంలో ఆయన కొత్త పోలీసు బాస్ గా వస్తున్నారు.

న్యూఢిల్లీ: ఐపిఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవ మార్చి 1వ తేదీ నుంచి ఢిల్లీ పోలీసు కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఢిల్లీ పోలీసు కమిషనర్ గా పనిచేస్తారు. సీఎఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య చెలరేగిన హింస నేపథ్యంలో ఆయనను కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఆర్పీఎఫ్) నుంచి తెచ్చి శాంతిభద్రతల ప్రత్యేక కమిషనర్ గా నియమించారు. 

హోం మంత్రిత్వ శాఖ ఆయనను ప్రత్యేక కమిషనర్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ రేపు శనివారం పదవీ విరమణ చేస్తున్నారు. అమూల్య స్థానంలో శ్రీవాస్తవ పోలీసు కమిషనర్ బాధ్యతలు నిర్వహించనున్నారు. 

శ్రీవాస్తవ అరుణాచల్ ప్రదేశ్ - గోవా - మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతం లేదా ఏజీఎంయుటీ 1985 బ్యాచ్ అధికారి. అమూల్య పదవీకాలాన్ని ఇది వరకు నెల పాటు పొడిగించారు. ఆ గడువు రేపటితో ముగుస్తుంది. కొత్త పదవిలో చేరేందుకు సీఆర్పీఎఫ్ శ్రీవాస్తవను రిలీవ్ చేసింది. 

 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం