
Liquor Policy Case: దేశ రాజధాని ఢిల్లీలో మద్యం కుంభకోణం రాజకీయ సంచలనం సృష్టిస్తోంది. ఈ కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో ఇప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కూడా సమన్లు పంపింది. దీంతో శనివారం సీఎం కేజ్రీవాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కేంద్రప్రభుత్వం, ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. సెప్టెంబర్ 17న సాయంత్రం 7 గంటలకు నేను ప్రధాని నరేంద్ర మోదీకి రూ.1,000 కోట్లు ఇచ్చాను. అరెస్టు చేయండి కాబట్టి ఈ వ్యక్తులు అంగీకరిస్తారా?
ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "నేను సెప్టెంబర్ 17వ తేదీ సాయంత్రం 7 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీకి ₹ 1,000 కోట్లు ఇచ్చానని చెబితే.. మీరు అతన్ని అరెస్టు చేస్తారా?" అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత ప్రశ్నించారు. కోర్టులకు అబద్ధాలు చెబుతున్నారని, అరెస్టు చేసిన వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఎలాంటి తప్పు చేసినట్లు రుజువు కూడా లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్ కి సీబీఐ సమన్లు జారీ చేసిన తర్వాత ఈ ప్రకటన చేశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో దాడికి దిగిన కేజ్రీవాల్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి సంస్థలు తమ తీవ్ర రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు అసాధారణ స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు.
14 ఫోన్‌లను ధ్వంసం చేశారని, ప్రమాణ స్వీకార పత్రాల్లో కోర్టులకు అబద్ధాలు చెప్పారని, అనుమానితులను చిత్రహింసలకు గురిచేస్తూ తప్పుడు కన్ఫెషన్స్ రాబట్టేందుకు బెదిరింపులకు పాల్పడ్డారని ఏజెన్సీలు తప్పుడు ప్రచారం చేశాయని ఆరోపించారు.
'వారు ఆదేశిస్తే.. కచ్చితంగా అరెస్ట్ చేస్తారు'
మాజీ డిప్యూటీ మనీష్ సిసోడియాని నెలల తరబడి విచారణ జరిపినప్పటికీ, అనేక అరెస్టులు పెట్టినప్పటికీ .. మద్యం స్కాం అని పిలవబడే స్కామ్ లో ఒక్క ఆధారం కూడా సేకరించలేదనీ, వారి సంపదలో అక్రమంగా ఒక్క పైసా కూడా ఏజెన్సీలు గురించలేకపోయారని అన్నారు. గోవా ఎన్నికల సమయంలో అక్రమంగా దాడులు చేసి.. భయాభంత్రులకు గురిచేశారనీ, వారికి ఆ దాడులలో ఏమీ దొరకకున్నా.. అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఆ ఎన్నికల్లో చెల్లింపులన్నీ చెక్కులతో జరిగాయని తెలిపారు.
అరవింద్ కేజ్రీవాల్ ఇంకా మాట్లాడుతూ.. గోవా ఎన్నికల్లో తమకు ఒక్క పైసా కూడా రాలేదనీ, రూ. 100 కోట్లు అని ఆరోపిస్తున్నారనీ.. అలా డబ్బు వస్తే.. ఆ డబ్బు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పూర్తి సమాచారముందని అన్నారు. కేజ్రీవాల్ అవినీతికి పాల్పడితే ఈ దేశంలో నిజాయితీపరులు ఎవరూ ఉండరని మరోసారి చెబుతాను. సీబీఐ నిన్న నాకు ఫోన్ చేసింది. నేను తప్పకుండా వెళ్తాను. నన్ను అరెస్ట్ చేయమని బీజేపీ సీబీఐకి ఆదేశిస్తే.. తప్పకుండా అరెస్ట్ చేస్తారని అన్నారు.