షాకింగ్ ఘటన.. గోడ‌పై మూత్రం పోశాడ‌ని చంపేశారు..

By Mahesh RajamoniFirst Published Aug 13, 2022, 4:27 PM IST
Highlights

Delhi: గోడపై మూత్రం పోశాడని ఓ వ్యక్తి కొట్టి చంపారు. వెంబడించి మరీ అత్యంత క్రూరంగా కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. షాకింగ్ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నలుగురిని అరెస్టు చేశారు. 
 

Delhi: గోడపై మూత్రం పోశాడని ఓ వ్యక్తి కొట్టి చంపారు. వెంబడించి మరీ అత్యంత క్రూరంగా కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. దేశరాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. షాకింగ్ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. నలుగురిని అరెస్టు చేశారు. 

ఈ దారుణ ఘటన గురించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఢిల్లీలో రద్దీగా ఉండే మార్కెట్‌లో 25 ఏళ్ల యువకుడిని వెంబడించి కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు శుక్రవారం నాడు వెల్లడించారు. గోడపై మూత్ర విసర్జన చేయడంపై జరిగిన వాగ్వాదం దాడికి దారితీసిందని పోలీసులు తెలిపారు. హోటల్ మేనేజ్‌మెంట్ విద్యార్థి అయిన మయాంక్, నిందితులలో ఒకరి గోడపై మూత్ర విసర్జన చేశాడు. ఈ క్రమంలోనే నిందితుడి తల్లితో మృతిని మ‌ధ్య గొడవ జ‌రిగిందిత‌. వాగ్వాదం సందర్భంగా నిందితుడిని దుర్భాషలాడి చెంపదెబ్బ కొట్టినట్లు కూడా సమాచారం.

దీంతో నిందితుడు మనీష్ తన స్నేహితులను పిలిచి మయాంక్, అతని స్నేహితుడు వికాస్‌ను వెంబడించాడు. దక్షిణ ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలోని డీడీఏ మార్కెట్ సమీపంలో మయాంక్‌ను పట్టుకున్న ఈ బృందం అతనిని పూర్తిగా ప్రజలు చూడకుండా కత్తితో పొడిచి చంపింది. అనంతరం న‌లుగురు నిందితులు అక్క‌డి నుంచి పారిపోయారు. అయితే, ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఈ క్ర‌మంలోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు.. మయాంక్‌ను ఎయిమ్స్‌కు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులు మనీష్, రాహుల్, ఆశిష్, సూరజ్‌లను గుర్తించారు. తొలుత రాహుల్, ఆశిష్, సూరజ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ తర్వాత బవానాకు చెందిన ప్రధాన నిందితుడు మనీష్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరానికి గల కారణాలను వెల్లడించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మూత్రం పోస్తే ప్రాణాలు తీయడమేంటని ప్రశ్నిస్తూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. 

click me!