రాహుల్ గాంధీపై మరో పరువునష్టం దావా వేసిన బీజేపీ.. ఎందుకంటే?

Published : Jun 14, 2023, 06:20 PM IST
రాహుల్ గాంధీపై మరో పరువునష్టం దావా వేసిన బీజేపీ.. ఎందుకంటే?

సారాంశం

కర్ణాటకలో రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లపై పరువు నష్టం కేసు ఫైల్ అయింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముంగిట అప్పటి బీజేపీ ప్రభుత్వం 40 శాతం అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రచారం చేసిందని, వార్తాపత్రికల్లో ప్రకటనలు వేసిందని, ఆ నిరాధారమైన ఆరోపణలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బ తీసే ప్రయత్నం చేసిందని కేసు ఫైల్ అయింది.  

బెంగళూరు: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ మరో పరువునష్టం దావా వేసింది. కర్ణాటక బీజేపీ సెక్రెటరీ ఎస్ కేశవ ప్రసాద్ మే 9వ తేదీన ఈ పిటిషన్ వేశారు. రాహుల్ గాంధీ సహా ప్రస్తుతం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లనూ ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు. రూ. 40 శాతం కమీషన్ తీసుకుంటున్నదని, నాలుగేళ్ల పాలనా కాలంలో సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయాలను బీజేపీ స్వాహా చేసిందని కాంగ్రెస్ పార్టీ న్యూస్ పేపర్‌లలో వేసిన ప్రకటన... తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారని డిఫమేషన్ పిటిషన్ వేశారు.

అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు ఈ పిటిషన్ ఫైల్ అయింది. ప్రజా ప్రతినిధుల కేసులను విచారించే ప్రత్యేక కోర్టు ముందే ఈ పిటిషన్ ఫైల్ అయింది. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు పిటిషన్‌లో పేర్కొన్న వారందరికీ సమన్లు పంపింది. జూలై 27వ తేదీకి విచారణను వాయిదా వేసింది.

Also Read: ముస్లిం యువతితో లవ్.. యువకుడి క్రూర హత్య.. ముక్కలుగా నరికేసిన ఆమె సోదరులు!

మంగళవారం ఈ కేసులోని రెస్పాండెంట్లు అందరికీ సమన్లు పంపించాలని ఆదేశించింది. 

కేశవ ప్రసాద్ ఫిర్యాదు ప్రకారం, గత నెల 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరుగుతన్న సందర్భంలో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రంలోని ప్రధాన వార్తా పత్రికల్లో బీజేపీపై నిరాధార ఆరోపణలతో ప్రకటనలు వేసింది. అప్పటి బీజేపీ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలో 40 శాతం అవినీతితో రూ. 1.5 లక్షల కోట్లను దోచుకుందని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ఆరోపణలు నిరాధారాలు, అసంగతమైనవి, పరువు నష్టం కలిగించేవని పిటిషనర్ పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్