తమతో కలిసి భోజనం చేశాడని.. దళితుడిని కొట్టి చంపారు

Published : May 06, 2019, 12:33 PM IST
తమతో కలిసి భోజనం చేశాడని.. దళితుడిని కొట్టి చంపారు

సారాంశం

ఒకవైపు దేశం శాస్త్ర, సాకేంతిక రంగాల్లో ముందుకు దూసుకుపోతోంటే...మరోవైపు కులాలు, కట్టుబాట్లు పేరిట కొట్టుకు చస్తున్నారు. తమ పక్కన భోజనం చేశాడని ఓ దళితుడిని అగ్రకులం వారు దారుణంగా కొట్టి చంపారు. 

ఒకవైపు దేశం శాస్త్ర, సాకేంతిక రంగాల్లో ముందుకు దూసుకుపోతోంటే...మరోవైపు కులాలు, కట్టుబాట్లు పేరిట కొట్టుకు చస్తున్నారు. తమ పక్కన భోజనం చేశాడని ఓ దళితుడిని అగ్రకులం వారు దారుణంగా కొట్టి చంపారు. ఈ దారుణ సంఘటన ఉత్తరాఖండ్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... గత నెల ఏప్రిల్ 26వ తేదీన జితేంద్ర దాస్ అనే యువకుడు  ఓ పెళ్లికి వెళ్లాడు. కాగా... అక్కడ వివాహ విందులో...అగ్రకులాల వారి కోసం  ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్ లో దళిత యువకుడు జితేంద్ర భోజనం తెచ్చుకునేందుకు వెళ్లాడు. దళితుడు అయ్యి ఉండి... అగ్రకులాలవారి కోసం ఏర్పాటు చేసిన కౌంటర్ కి వచ్చాడని వారు మండిపడ్డారు.

వెంటనే.. జితేంద్రను అతి కిరాతకంగా కొట్టారు. గమనించిన జితేంద్ర కుటుంబసభ్యులు, స్నేహితులు అతనిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా...రెండు, మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన జితేంద్ర కన్నుమూశాడు.

బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మాతో భోజనం చేయాలనుకుంటే చస్తావ్ అని అగ్రకులానికి చెందిన యువకులు బెదిరించారని.. బాధితుడి స్నేహితుడు ఒకరు  చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Palamedu Jallikattu Begins in Madurai: తమిళనాడులో హోరా హోరీగా జల్లికట్టు| Asianet News Telugu
JIO : తక్కువ ధరకే 200 జీబీ డేటా.. జియో అద్భుత రీచార్జ్ ప్లాన్