దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ అనుమానాన్సద మృతి

By narsimha lodeFirst Published Feb 22, 2021, 4:30 PM IST
Highlights

దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్  ముంబైలోని ఓ హోటల్ లో అనుమానాస్పదస్థితిలో మరణించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు.

ముంబై:దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్  ముంబైలోని ఓ హోటల్ లో అనుమానాస్పదస్థితిలో మరణించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించారు.

దేల్కర్ ఇండిపెండెంట్ గా దాద్రానగర్ నుండి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆయనకు భార్య కలాబెన్, ఇద్దరు పిల్లలు అభినవ్, దివిత ఉన్నారు.

ముంబైలోని మెరైన్ డ్రైవ్ లోని హెటల్‌లో సీ గ్రీన్ లో దేల్కర్ మృతదేహన్ని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. గుజరాతీ భాషలో రాసిన సూసైడ్ నోట్ ను డెల్కర్ బస చేసిన గది నుండి పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

1986 నుండి మోహన్ దేల్కర్ అనేక కీలక పదవులను అనుభవించారు. 1986-89 వరకు దాద్రానగర్ హవేలీ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

1989లో 9వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1990-91లో సబార్డినేట్ చట్టంపై ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు.ఎస్సీ,ఎస్టీ సంక్షేమంపై కమిటీలో ఆయన పనిచేశారు. 

1991లో రెండోసారి, 1996లో మూడోసారి ఆయన ఇదే స్థానం నుండి విజయం సాధించారు.1996-97 మధ్య అతను పట్టణ, గ్రామీణాభివృద్ధి కమిటీ, సమాచార మార్పిడి, సమాచార మంత్రిత్వశాఖలో సభ్యుడిగా పనిచేశారు. 1998లో నాలుగోసారి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు.

1999లో ఆయన ఐదోసారి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. 2004లో ఆయన ఆరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో ఏడోసారి ఎంపీగా విజయం సాధించాడు. 
 

click me!