Cyclone Shaheen : ‘గులాబ్’ పోయింది ‘షహీన్’ వచ్చింది.. ఏడు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం.. వాతావరణ శాఖ..

By AN TeluguFirst Published Oct 2, 2021, 10:38 AM IST
Highlights

గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుఫాను మధ్య అరేబియా తీర ప్రాంతాలవైపు దూసుకొస్తోంది. ఆ తరువాత అది తీవ్ర తుఫానుగా మారి పాకిస్తాన్ లో మాక్రన్ తీర ప్రాంతాన్ని తాకుతుంది. 

ముంబై : గులాబ్ తుఫాను ((Gulab Cyclone) కల్లోలం ముగిసిందో లేదో మరో తుఫాను తరుముకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాను (Cyclone Shaheen)క్రమంగా బలపడుతోంది. ఏడు రాష్ట్రాల్లో ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ (IMD) శుక్రవారం హెచ్చరించింది. 

గుజరాత్, బీహార్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుఫాను మధ్య అరేబియా తీర ప్రాంతాలవైపు దూసుకొస్తోంది. ఆ తరువాత అది తీవ్ర తుఫానుగా మారి పాకిస్తాన్ లో మాక్రన్ తీర ప్రాంతాన్ని తాకుతుంది. 

ఆ తరువాత 36 గంటల్లో దిశ మార్చుకుని గల్ఫ్ ప్రాంతాలపై వేళ్లి ఆ తరువాత బలహీనపడుతుంది’ అని వాతావరణ శాఖ వెల్లడించింది. గులాబ్ తుపాను ప్రభావం కారణంగా ఏర్పడిన షహీన్ తుపానుతో ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

కాగా, బంగాళా ఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణలో గత ఆది, సోమవారాలు భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, మిగతాచోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రకటించారు. 

గత శనివారం కూడా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో సాయంత్రం కుండపోత వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యింది. దీంతో ఇప్పటికే నదులు,వాగులు వంకలు పొంగిపొర్లుతూ ప్రమాదకర రీతిలో ప్రవహిస్తున్నారు. జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారాయి. ఈ నేపథ్యంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.  

మరో తెలుగురాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ పై ఈ గులాబ్ తుఫాను ప్రభావం ఎక్కువగా వుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు తుఫాన్ హెచ్చరికలను జారీ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోనూ గులాబ్ తుఫాన్ ప్రభావముందని చెప్పడంతో అధికారులు ముందుజాగ్రత్త చర్యల్లో తలమునకలయ్యారు.

Cyclone Gulab: తప్పిన ముప్పు... తీవ్ర వాయుగుండంగా బలహీనపడ్డ తుఫాను

తుఫాన్ సమయంలో తీరంలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చని ఐఎండీ అంచనా వేసింది. శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని... సోమవారం సాయంత్రానికల్లా తుఫాన్ మళ్లీ అల్పపీడనంగా మారిపోతుందని తెలిపింది.  

దీని ప్రకారమే సోమవారం నాటికి ఉత్తరాంధ్ర ప్రజలకు గులాబ్ తుఫాను గండం తప్పింది. ప్రమాదకరంగా తీరంవైపు దూసుకువచ్చిన ఈ తుపాను ఆదివారం రాత్రి కళింగపట్నం–గోపాలపూర్‌ మధ్య తీరం దాటింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో తీరాన్ని తాకిన తుపాన్‌ అనంతరం కళింగపట్నానికి పశ్చిమంగా ఒడిశా వైపు పయనించింది. 

అయితే గులాబ్ తుఫాను తీవ్రత తగ్గి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది.  రాగల 6 గంటల్లో వాయుగుండం మరింత బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను వాయుగుండంగా మారినా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిశాయి. అలాగే ఏపీ, తెలంగాణలో భారీనుండి అతిభారీ వర్షాలు కురిశాయి.
 

click me!