CWC Meet: కాంగ్రెస్ కొత్త కార్యవర్గం తొలి భేటీ.. ఎన్నిక‌లు, భార‌త్ జోడో యాత్ర 2.0 సహా పలు కీలక అంశాలపై చర్చ

Hyderabad: హైద‌రాబాద్ లో కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తొలి సమావేశం జరగనుండగా, భారత్ జోడో యాత్ర, తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు సహా ప‌లు అంశాలపై భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించనున్నార‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించి పలువురు కొత్త ముఖాలకు చోటు కల్పించింది. శనివారం జరిగే సమావేశం అనేక విధాలుగా చాలా ముఖ్యమైనదనీ, అనేక విష‌యాలపై చ‌ర్చ జ‌ర‌గ‌నుంద‌ని స‌మాచారం.
 

CWC Meet: First meeting of new Congress Working Committee, Discussion on many important issues including elections, Bharat Jodo Yatra 2.0 RMA

Congress Working Committee Meet: రాబోయే లోక్ సభ ఎన్నికలకు భవిష్యత్ వ్యూహం, ప్రతిపక్ష కూటమి 'ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్' (ఇండియా) ఐక్యత, రాబోయే ప‌లు రాష్ట్రాల‌ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు తదితర అంశాలపై చర్చించేందుకు కొత్త కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) తొలి సమావేశం శనివారం హైద‌రాబాద్ లో జరగనుంది. ఆగస్టు 20న పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించింది. కార్యవర్గంలో 39 మంది సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు. సచిన్ పైలట్, శశిథరూర్ వంటి నేతలకు తొలిసారి ఈ కార్యవర్గంలో చోటు దక్కింది.

ఈ క్ర‌మంలోనే ఈ నెల 16న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, మరుసటి రోజు కార్యవర్గం సమావేశం కానున్నాయి. కార్యవర్గ సభ్యులందరితో పాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. కార్యవర్గ సమావేశం అనంతరం 17న హైదరాబాద్ సమీపంలో తుక్కుకూడ‌లో జరిగే బహిరంగ సభలో పార్టీ అగ్రనేతలు ప్రసంగిస్తారు. రానున్న లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాన్ని చుట్టుముట్టే వ్యూహం, ప్రతిపక్ష కూటమి 'ఇండియా' ఐక్యతను ముందుకు తీసుకెళ్లడం, సంస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రెండో దశ 'భారత్ జోడో యాత్ర'పై కూడా ఈ కార్యవర్గంలో చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

Latest Videos

వర్కింగ్ కమిటీ మీటింగ్, బహిరంగ సభ, ర్యాలీతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం రెండు డజన్లకు పైగా ప్రతిపక్ష పార్టీలు కలిసి ప్రతిపక్ష కూటమి 'ఇండియా'ను ఏర్పాటు చేసిన సమయంలో జరగబోతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనీ, సాధ్యమైనంత వరకు సీట్ల విషయంలో సమన్వయం చేసుకోవాలని 'ఇండియా' భాగస్వామ్య పక్షాలు నిర్ణయించాయి. వర్కింగ్ కమిటీ సమావేశంలో 'ఇండియా' కూటమిని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఇదే స‌మ‌యంలో త్వ‌ర‌లో మధ్యప్రదేశ్, ఛత్తీస్ గ‌ఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లపై  కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా లోక్ సభ ఎన్నికల్లో తన పట్టును బలోపేతం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక పరిస్థితి, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు, అవినీతి వంటి అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహంపై కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

vuukle one pixel image
click me!