చిదంబరానికి షాక్: కోర్టు ఆదేశాలు, మరో అరెస్ట్ తప్పదా?

By narsimha lode  |  First Published Oct 15, 2019, 5:29 PM IST

మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది.ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని అవసరమైతే అరెస్ట్ కూడ చేసేందుకు అనుమతిని ఇచ్చింది.



న్యూఢిల్లీ:ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి పి.చిదంబరాన్ని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ మేరకు కోర్టు అనుమతిచ్చింది. మంగళవారం నాడు సీబీఐ ప్రత్యేక కోర్టు ఈడీ అధికారులు చిరందబరాన్ని ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

మంగళవారం నాడు మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని ఢిల్లీ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. తనకు ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని పి.చిదంబరం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు

Latest Videos

undefined

అయితే బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.జైల్లోనే చిదంబరం ఉండాలని బయలకు వస్తే ఇబ్బందని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. 

అంతేకాదు ఈ కేసులో చిదంబరాన్ని తీహార్ జైలుకు వెళ్లి ప్రశ్నించే అవకాశాన్ని ఈడీ అధికారులకు కల్పించింది సీబీఐ కోర్టు. అవసరమైతే చిదంబరాన్ని అరెస్ట్ చేయవచ్చని కూడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.చిదంబరం హోదా గురించి చూడొద్దని ప్రజల కోణంలో ఈ కేసు విచారణకు చేయాల్సిందంతా చేయాలని కోర్టు ఈడీకి సూచించింది.

2017 మే 15వ తేదీన  ఐఎన్ఎక్స్ మీడియా కేసులో  సీబీఐ కేసు నమోదు చేసింది. ఫెమా నిబంధనలను ఉల్లంఘించి విదేశీ నిధులను మళ్లించారని సీబీఐ కేసు పెట్టింది.

2007లో విదేశీ పెట్టుబడులు రూ. 305 కోట్లను పెట్టుబడులు వచ్చాయి. ఈ పెట్టుబడులు ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో మళ్ళించిన సమయంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రిగా పి.చిదంబరం ఉన్నాడు. 

ఈ కేసులో సీబీఐ మనీలాండరింగ్ కేసు కూడ నమోదు చేసింది.ఇదే కేసులో సీబీఐ అధికారులు ఈ ఏడాది ఆగష్టు 21న  అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల పాటు ప్రశ్నించిన తర్వాత ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నాడు ఈ నెల 17వరకు చిదంబరానికి రిమాండ్ లో ఉన్నాడు.

కోర్టు ఆవరణలోనే విచారణకు ఈడీ మాత్రం నిరాకరించింది. దీంతో ఈ నెల 16వ తేదీన తీహార్ జైలులో విచారణకు ఈడీకి అనుమతిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో బుధవారం నాడు సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు ఈడీ అధికారులు తీహార్ జైల్లో మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్న విచారించనున్నారు.

ఇవాళ జరిగిన వాదనల సమయంలో ఈడీ వాదనను మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తరపు న్యాయవాది వ్యతిరేకించారు. చిదంబరానికి బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే కోర్టు మాత్రం చిదంబరానికి బెయిల్ ఇవ్వలేదు. చిదంబరం విచారణకు అనుమతిస్తూ ఆదేశాు జారీ చేసింది. 

 

 


 

click me!